రష్యా : ఆయుధాల్లో ఉపయోగించే కీలక పరికరాలు, సాంకేతికత చైనా నుంచి రష్యాకు
అందుతోందని అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొంది. ఆంక్షల చట్రంలో ఉన్న
రష్యాకు బీజింగ్ నుంచి కీలకమైన పరికరాలతోపాటు టెక్నాలజీ సరఫరా అవుతోందని
అమెరికా ఇంటెలిజెన్స్ గుర్తించింది. ఈ విషయాన్ని అమెరికాలోని డైరెక్టర్ ఆఫ్
నేషనల్ ఇంటెలిజెన్స్ కార్యాలయం నివేదికలో వెల్లడించింది. పశ్చిమ దేశాల
ఆంక్షల తర్వాత రష్యాకు చైనానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారిందని
పేర్కొంది. రష్యా ఆయుధాలకు అవసరమైన నేవిగేషన్ పరికరాలు, జామింగ్ టెక్నాలజీ,
ఫైటర్ జెట్ల విడిభాగాలను చైనా ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు సరఫరా చేసినట్లు
కస్టమ్స్ రికార్డులు చెబుతున్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇక హాంకాంగ్,
చైనాలోని చిరు వ్యాపారుల వద్ద నుంచి చిప్స్ కొనుగోలు చేసి రష్యాకు
తరలిస్తున్నట్లు కూడా తెలిసింది. జీ-7 దేశాలు రష్యా చమురు ధరపై ఆంక్షలు
విధించాక చైనా నుంచి కొనుగోళ్లు భారీగా పెరిగాయి. రష్యా డిస్కౌంట్లు కూడా
దీనికి ఉపకరిస్తున్నాయి. దీంతో రష్యాకు ఆదాయంలో పెద్దగా తగ్గుదల లేదని అమెరికా
నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 2022లో చైనా నుంచి రష్యా దిగుమతులు 13శాతం
పెరిగి 76 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో బీజింగ్‌కు రష్యా ఎగుమతులు 43
శాతం పెరిగి 113 బిలియన్ డాలర్ల మార్కును తాకాయి. ద్వైపాక్షిక వాణిజ్యం 30
శాతం పెరిగి 190 బిలియన్ డాలర్లకు చేరింది. రష్యా చమురును తమ పోర్టులకు
తెచ్చేందుకు అవసరమైన సూపర్ ట్యాంకర్లు, బీమా కవరేజిని చైనా అందిస్తోంది. జీ-7
దేశాల ఆంక్షల తర్వాత పశ్చిమ దేశాల నుంచి రష్యాకు ట్యాంకర్లు, బీమా లభించడం
కష్టంగా మారింది. కొన్నాళ్లుగా అమెరికాలోని జోబైడెన్ కార్యవర్గం తరచూ చైనాపై
ఆరోపణలు చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం కోసం కొన్ని కీలక పరికరాలు బీజింగ్
నుంచి మాస్కోకు అందుతున్నాయని పేర్కొంటోంది. యుద్ధ ప్రారంభ సమయంలో కొన్ని
ఆయుధాలు చైనా నుంచి రష్యాకు అంది ఉంటాయని అనుమానిస్తోంది.