తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘జైలర్’ త్వరలో విడుదలకు
సిద్ధమవుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా అనంతరం ఆయన ‘జై భీమ్’
దర్శకుడు టీజే జ్ఞానవేల్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. సామాజికాంశాలను చర్చిస్తూ
ఈ సినిమా సాగుతుందని, యదార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని
తెరకెక్కించబోతున్నారని తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమ చారం మేరకు హీరో నాని
ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.
కథ నచ్చడంతో పాటు రజనీకాంత్ వంటి అగ్రనటుడితో తెరను పంచుకునే అవకాశం ఉండటంతో ఈ
సినిమాలో నటించడానికి నాని సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. అయితే ఈ వార్తల్లో
నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ
ఏడాది ‘దసరా’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు నాని. ప్రస్తుతం నాని
‘హాయ్ నాన్న’ చిత్రంలో నటిస్తున్నారు. తండ్రీ కూతురు సెంటిమెంట్ ప్రధానంగా ఈ
చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఏ.ల్. విజయ్.