చిత్ర పరిశ్రమ అనేది గౌరవం ఉన్న ఇండస్ట్రీ. మన హద్దుల్లో మనం ఉండి సినిమాలు
చేసుకుంటే అడ్డు ఏదీ ఉండదు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. తెలుగమ్మాయి అయిన
హీరోయిన్ ప్రణవికి నేను ఇచ్చే సలహా ఇదే అని అంటోంది శ్రీలీల. సంజయ్ రావు,
ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్
హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ సినిమా రిలయన్స్
ఎంటర్టైన్మెంట్ ద్వారా నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన ఈ
సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిధిగా హాజరైన శ్రీలీల మాట్లాడుతూ- “స్లమ్
డాగ్ హజ్బెండ్’ సినిమా సూపర్ హిట్ కావాలి” అని కోరుకుంటున్నాను అన్నారు. “మా
సినిమాలో వినోదం, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి” అన్నారు ఏఆర్ శ్రీధర్,
“శ్రీలీల, వైష్ణవీ చైతన్య, ప్రణవి తెలుగు అమ్మాయిలే. నా కొత్త సినిమాకు తెలుగు
అమ్మాయినే హీరోయి నా తీసుకుంటా” అన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు సానా. “స్లమ్
డాగ్ హజ్బెండ్’ హిట్ అయితే మరో పదిమంది కొత్తవాళ్లకు అవకాశాలు ఇస్తాం” అన్నారు
అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి.