తినటం వల్ల బోలేడన్ని ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో చూద్దాం..
ప్రయోజనాలు
1.వేరుశెనగలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్,
ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు పొటాషియం, సోడియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కాపర్
వంటివి పుష్కలంగా ఉంటాయి.
2.వేరుశెనగ గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు పదార్థాలు శరీరంలో పేరుకుపోయిన
చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సహాయపడతాయి.
3.బాదం, వాల్ నట్స్, జీడిపప్పు వంటి వాటిలో ఉన్నట్లే పల్లీల్లో కూడా పోషకాలు
ఎక్కువగా ఉంటాయి. వేరుశెనగలో ఉండే పోషకాలు ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి
కాపాడుతాయి.
4.పల్లీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లు
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాలనే తినాలి. వేరుశెనగలో ఫైబర్ కంటెంట్
కూడా ఉంటుంది. అందుకే మధుమేహంతో బాధపడేవారు వీటిని మోతాదులో తింటే మంచి
ప్రయోజనాలను పొందుతారు.
5.వేరుశెనగలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
వేరుశెనగలు కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి కాబట్టి.. బరువు
తగ్గాలనుకునే వారు కూడా వేరుశెనగలను తింటే మంచి ఫలితం ఉంటుంది.
6.ఓ అధ్యయనం ప్రకారం.. వేరుశెనగ తినడం వల్ల ఎక్కువ కాలం బతుకుతారట. అంటే..
వేరుశెనగ లాంటి గింజలు అరుదుగా తినే వ్యక్తుల కంటే ఎక్కువ తినే వారు ఏ
కారణంతోనైనా చనిపోయే అవకాశం తక్కువగా ఉందని తెలిపారు. అయితే దీనిపై మరిన్ని
పరిశోధనలు చేయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు.
7.వేరుశెనగ ఆరోగ్యకరమైన ఆహారమే అయినప్పటికీ వేరుశెనగ అలెర్జీ, దురద,
దద్దుర్లు, వికారం లేదా ముఖం వాపురావడం వంటి లక్షణాలను కలిగిన వారు దీనిని
తినకపోవడమే మంచిది.
8.రోజూ పల్లీలను లిమిట్ లో తింటే ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్య నిపుణులు
చెబుతుంటారు. అంతే కాకుండా వేరుశెనగ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా
నియంత్రించగలదని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి.