పొడిబారిపోతుంది. చిన్న చిన్న పొక్కులు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి
తప్పించుకోవటానికి సౌందర్యనిపుణులు కొన్ని ఫేస్ ప్యాక్ లు వాడమని
సూచిస్తున్నారు.అవేంటో చూద్దాం..
అరిటిపండు ఓట్మీల్ ఫేస్ ప్యాక్:
పొడిచర్మం ఉన్నవారికి ఈ ఫేస్ ప్యాక్ ఎంతో ఉపకరిస్తుంది. ఒక గిన్నెలో బాగా
ముగ్గిన అరిటి పండు గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల
కొబ్బరినూనె, నాలుగు టేబుల్ స్పూన్ల ఓట్మీల్ను వేయాలి. వీటన్నింటినీ బాగా
మెత్తగా గుజ్జులా కలపాలి. ఈ గుజ్జును ముఖానికి పట్టించి ఒక పది నిమిషాలు
వదిలేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ఈ గుజ్జును కడిగి వేయాలి. ఇలా క్రమం
తప్పకుండా చేస్తే చర్మం మెరుస్తూ ఉంటుంది.
పెసరపిండి- పాల ఫేస్ ప్యాక్:
ఒక గిన్నెలో ఐదు చెంచాల పెసరపిండిని తీసుకోవాలి. దానిలో మూడుచెంచాల పచ్చిపాలు,
రెండు చెంచాల తేనె వేయాలి. ఈ మూడింటిని బాగా కలిపి ముద్దగా చేయాలి. ఈ
మిశ్రమాన్ని ముఖానికి పట్టించి- పదినిమిషాలు వదిలివేయాలి. ఆ తర్వాత ముఖాన్ని
వెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే- ముఖంపై ఉన్న మృతకణాలన్నీ
తొలగిపోతాయి.