న్యూఢిల్లీ : మణిపూర్‌లో పర్యటించి, అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులపై
సమస్యలకు తగు పరిష్కారం చూపుతూ కేంద్ర ప్రభుత్వానికి, పార్లమెంట్‌కు నివేదిక
అందజేస్తామని ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి నేతలు ప్రకటించారు. కూటమిలోని 16
పారీ్టలకు చెందిన 20 మంది ఎంపీలు ఈ నెల 29, 30వ తేదీల్లో మణిపూర్‌లో
పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ నుంచి ఆధిర్
రంజన్ ఛౌధురి, గౌరవ్ గొగోయ్, టీఎంసీ నేత సుష్మితా దేవ్, జేఎంఎంకు చెందిన
మహువా మాజి, డీఎంకే కనిమొళి, ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్, ఆర్ఎల్డీ జయంత్
చౌధరి, ఆర్జేడీ మనోజ్ ఝా, ఆర్ఎస్పీ ఎన్కే ప్రేమచంద్రన్, వీసీకే నేత
తిరుమావళన్. వీరితో పాటు జేడీ(యు) చీఫ్ రాజీవ్ రంజన్ సింగ్, జేడీ–యూకు
చెందిన అనీల్ ప్రసాద్ హెగ్డే, సీపీఐ నుంచి సందేశ్ కుమార్, సీపీఎం నేత ఏఏ
రహీం, ఎస్పీ నుంచి జావెద్ అలీఖాన్, ఐయూఎంఎల్ ఈటీ మహ్మద్ బషీర్, ఆప్ నేత
సుశీల్ గుప్తా, శివసేన(యూటీ) అరి్వంద్ సావంత్, డీఎంకే నేత డి.రవి కుమార్,
కాంగ్రెస్ నేతలు ఫులో దేవి నేతం, కె.సురేశ్ ఈ బృందంలో ఉన్నారు.
సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తితో మణిపూర్ హింసపై దర్యాప్తు జరిపించాలని
లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ కేంద్ర ప్రభుత్వాన్ని
డిమాండ్ చేశారు. మణిపూర్‌లో అంతా మంచిగానే ఉన్నట్లు చూపాలని కేంద్రం
అనుకుంటోందని ఆరోపించారు.
మహిళల గౌరవంతో ఆటలా? : బీజేపీ అధికార దాహంతోమహిళల గౌరవంతో, దేశ ఆత్మగౌరవంతో
ఆటలాడుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు
ఫేస్బుక్లో వీడియో షేర్ చేశారు. మణిపూర్‌లో మహిళలపై లైంగిక దాడులు
జరుగుతున్నా కేంద్రం నోరు విప్పడం లేదని మండిపడ్డారు. మహిళా రెజ్లర్లపై
బ్రిజ్‌భూషణ్ సింగ్ లైంగిక వేధింపులను ప్రస్తావిస్తూ, మహిళలను గౌరవించని
దేశం పురోగమించదన్నారు.