రామ్ – పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘డబుల్
ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది. పూరి
కనెక్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంజయ్ దత్ ప్రతినాయకుడిగా
నటిస్తున్నారు. ముంబయిలో జరుగుతోన్న ఈ చిత్ర తొలి షెడ్యూల్ తాజాగా
పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం ప్రకటించింది. ఈ షెడ్యూల్లో
భాగంగా కేచ మాస్టర్ నేతృత్వంలో రామ్ పై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు.
తదుపరి షెడ్యూల్ బ్యాంకాక్ లో మొదలు కానున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి జియాని
గియాన్నెల్లి ఛాయా గ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా మహా శివరాత్రి
సందర్భంగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.