సమస్య చిరాకుగా ఉంటుంది. జలుబు నుంచి ఉపశమనం పొందడానికి ఏం చేయాలంటే..
చికెన్ సూప్:
వర్షాకాలంలో చికెన్ సూప్ తాగడంతో జలుబు, దగ్గు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి, మిరియాలతో తయారు చేసిన సూప్ తాగడంతో జలుబు
రాదు.
అల్లం టీ:
వర్షాకాలంలో అల్లం టీ తాగడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులోని ఔషధ గుణాలు
జలుబు నుంచి ఉపశమనం అందిస్తాయి. అల్లం టీలో దాల్చినచెక్క, తేనె కలుపుకొని
తాగడంతో మంచి ఫలితాలు పొందవచ్చు.
పుట్టగొడుగులు:
పుట్టగొడుగులు తినడంతో రోగనిరోధకశక్తి మెరుగుపడుతుంది. వీటిని తినడంతో జలుబు
నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు.
గ్రీన్ టీ:
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధి కారకాలతో
పోరాడతాయి. గ్రీన్ టీ యాంటీ వైరల్గా పని చేస్తుంది. దీంతో జలుబు నుంచి తక్షణ
ఉపశమనం లభిస్తుంది.
స్వీట్ పొటాటో:
చిలగడదుంపల్లో విటమిన్ ఏ, విటమిన్ సీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో
వ్యాధినిరోధకశక్తి మెరుగుపడుతుంది. ఇందులో ఉన్న యాంటీ వైరల్, యాంటీ
బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని రక్షణను అందిస్తాయి.
వెల్లుల్లి:
జలుబుతో ఇబ్బంది పడుతున్న సమయంలో వెల్లుల్లి తినడం సరైనది. ఇందులో ఉన్న యాంటీ
వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జలుబు నుంచి ఉపశమనం అందిస్తాయి.
విశ్రాంతి:
జలబుతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఎక్కువ సమయం పాటు విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం.
నిద్రపోయే సమయంలో జలుబు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
సాల్మన్:
సాల్మన్ చేపల్లో విటమిన్ డీ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జలుబుకు కారణమయ్యే
వైరస్లతో పోరాడతాయి. జలుబు నుంచి ఉపశమనం అందించడంలో ఇవి సహాయపడతాయి.