దోహదపడతాయి..అవేంటో తేలుసుకుందాం..
బీట్ రూట్:
ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపర్చడంలో బీట్ రూట్ సహాయపడుతుంది. వీటిలోని
నైట్రేట్స్ శ్వాస వ్యవస్థలోని లోపాల్ని నివారిస్తాయి.
పచ్చిమిర్చి:
పచ్చిమిర్చిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే వీటిలోని శక్తివంతమైన యాంటీ
ఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్స్ నీ తగ్గిస్తాయి. మరియు ఊపిరి
తిత్తులను కాపాడతాయి.
యాపిల్స్:
స్మోకింగ్ మానేసిన వారిలో ఊపిరితిత్తులు కోలుకోవాలంటే ప్రతిరోజూ ఓ యాపిల్
తినడం ఉత్తమం. ఇవి ఊపిరితిత్తులను క్లీన్ చేసి ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్
వంటివి రాకుండా నివారిస్తాయి.
పసుపు:
పసుపులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు
ఎక్కువ. ఇవి ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్స్ నివారించి వాటి పనితీరును
మెరుగుపరుస్తాయి.
గుమ్మడి:
ఆరోగ్యాన్ని కాపాడే మొక్కల ఆధారిత సమ్మేళనాలు గుమ్మడిలో పుష్కలంగా ఉంటాయి.
వీటిలోని పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు
ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తాయి.
టొమాటో:
టొమాటోల్లో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల్లోని మంట,
వాపు వంటి సమస్యల్ని తగ్గిస్తుంది. శ్వాస సంబంధ రోగాలు రాకుండా నివారిస్తుంది.
బ్లూబెర్రీ:
బ్లూబెర్రీ పండ్లలో ఆంథోసయానిన్ అనే సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి
ఊపిరితిత్తుల్లో ఆక్సిడేటివ్ ఒత్తిడి వల్ల జరిగే నష్టాన్ని నివారిస్తాయి.
గ్రీన్ టీ:
గ్రీన్ టీలో కెటాచిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. అలాగే ఇందులోని యాంటీ
ఇంఫ్లమేటరీ గుణాలు ఊపిరిత్తుల్లోని ఇన్ఫెక్షన్ ను ప్రభావవంతంగా నివారిస్తాయి.
ఆలివ్ ఆయిల్:
ఆస్తమా వంటి సమస్యలు ఉన్నవారు ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం మంచిది. ఇందులోని
యాంటీఆక్సిడెంట్, యాంటీఇంఫ్లమేటరీ గుణాలు, విటమిన్ ఇ ఊపిరిత్తుల సమస్యల్ని
తగ్గిస్తుంది.