15 బృందాలతో దాడులు
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరోసారి ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి.
జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో మంగళవారం(ఆగస్టు1) ఉదయం నుంచే దాడులు
జరుపుతోంది. మాలినేని సాంబశివరావుతో పాటు పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ
అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 15 బృందాలతో ఏకకాలంలో సోదాలు
చేస్తున్నారు. కాగా మాలినేని సాంబశివరావు నాలుగు కంపెనీలకు డైరెక్టర్లుగా
కొనసాగుతున్నారు. ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రా
టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రై రోడ్డు ప్రాజెక్ట్‌లకు
డైరెక్టర్‌గా ఉన్నారు.