గిర్డర్ యంత్రం కూలి 16 మంది మృతి
థానే జిల్లా షాపూర్లో ఘటన
సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే ఫేస్-3 రోడ్డు పనులు, బ్రిడ్జి నిర్మిస్తున్న
సమయంలో అకస్మాత్తుగా ప్రమాదం
పిల్లర్లతో అనుసంధానించే గిర్డర్ యంత్రం కార్మికులపై పడటంతో ఘోర ప్రమాదం
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
ముంబై : మహారాష్ట్ర థానే జిల్లాలో దారుణం జరిగింది. షాపూర్ సమీపంలో నిర్మాణంలో
ఉన్న ఒక బ్రిడ్జి గిర్డర్ లాంచర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 16 మంది
మరణించగా ముగ్గురు గాయపడ్డారు. మహారాష్ట్ర థానే జిలాలోని షాపూర్ సమీపంలో
జరుగుతున్న సమృద్ధి ఎక్స్ ప్రెస్ నిర్మాణం మూడో దశ పనుల్లో అపశ్రుతి
చోటుచేసుకుంది. బ్రిడ్జిల నిర్మాణానికి ఉపయోగించే గిర్డర్ లాంచర్ సుమారుగా 100
అడుగుల ఎత్తు నుండి కుప్పకూలడంతో 16 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో
ముగ్గురు మాత్రం గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన గురించి
తెలుసుకుని పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి
చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను, గాయపడినవారిని దగ్గర్లోని
ఆసుపత్రికి తరలించారు. శిధిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అంచనా
వేస్తున్నారు. అంతకుముందు ఆదివారం రోజున బుల్దానా జిల్లాలో 6వ నెంబరు జాతీయ
రహదారి మీద ఒక ట్రక్ విధులు నిర్వహిస్తున్న పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన సంఘటన
మరువక ముందే మరో ప్రమాదం జరగడం ఇక్కడి వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఆ
ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా 21 మంది గాయపడ్డారు.
మహారాష్ట్రంలో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. బ్రిడ్జ్ నిర్మాణం కోసం
ఏర్పాటు చేసిన గిర్డర్ అకస్మాత్తుగా కూలడంతో ఏకంగా 16 మంది మృతి చెందారు.
పలువురు గాయపడ్డారు. థానే జిల్లా షాపూర్లో సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే ఫేస్-3
రోడ్డు పనులకు సంబంధించి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన
గిర్డర్ యంత్రం ఒక్కసారిగా కార్మికులపై పడింది. పిల్లర్లతో అనుసంధానించే ఈ
యంత్రం వంద అడుగుల ఎత్తు నుంచి పడినట్టు తెలుస్తోంది. సమాచారం అందగానే
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు, గాయపడిన
వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం
ఉన్నట్టు తెలుస్తోంది.