ప్రజలకు మేలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం- వెలంపల్లి
విజయవాడ : స్థానిక 43వ డివిజన్ లో గురువారం మాజీ మంత్రి, పశ్చిమ శాసన సభ్యులు
వెలంపల్లి శ్రీనివాసరావు నగరపాలక సంస్థ అధికారులతో కలిసి విస్తృతంగా
పర్యటించారు.
ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ డివిజన్ లో 30 కోట్ల రూపాయల నిధులతో
అభివృద్ది చేపట్టాం జర గిందన్నారు.గతంలో ఎవరు చెయ్యని విధంగా అభివృద్ది
చేస్తున్నాం అన్నారు.రోడ్లు, పార్కులు అభివృద్ది చేశామన్నారు.ఇంకా కొన్ని
రోడ్లు వెయ్యాలి వాటిని త్వరితగతిని అభివృద్ది చెయ్యాలని అధికారులను
ఆదేశించారు.అమరావతి ఇల్లు వచ్చినవారికి పట్టాలు పంపిణీ చేసినట్లు
తెలిపారు.ప్రతి ఇంటికి వెళ్ళి పత్రాలు పంపిణీ చేశామన్నారు.జగన్ మోహన్ రెడ్డి
హయాంలో చక్కటి పరిపాలన అదిస్తున్నమన్నారు.ప్రజలకు మేలు చేస్తున్న ఏకైక
ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి,పువ్వుల కాంత రావు,ఎస్
వి రెడ్డి,బెవర నాగేశ్వర రావు,తిరుపతిరావు,వెంకటేశ్వర్లు, అత్మారామ్,తిరుపతి
రెడ్డి,అంజనేయ రెడ్డి, తదితర డివిజన్ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ
కన్వీనర్లు, గృహసారధులు, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బంది
పాల్గొన్నారు