విశాఖపట్నం కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణపనులకు భూమి పూజ చేసిన సీఎం
వైయస్ జగన్ మోహన్ రెడ్డి
వైయస్ జగన్ మోహన్ రెడ్డి
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లాలో మంగళవారం సీఎం జగన్ పర్యటించారు.
విశాఖపట్నం కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణపనులకు సీఎం వైయస్.జగన్
మోహన్ రెడ్డి భూమిపూజ చేసారూ. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్,
గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయడు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని,
పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పరిశ్రమలు, ఐటీ శాఖ
మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ వైవీ
సుబ్బారెడ్డి, రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా, సీఈఓ రజనీష్ మహాజన్,
సీఓఓ శ్రావణ్ కుమార్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ఇతర
ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.