108కు కొత్త వాహనాలు.. ప్రారంభించిన సీఎం కేసీఆర్
ఇతర రాష్ట్రాల్లో స్కామ్‌లు..తెలంగాణలో స్కీమ్‌లు : హరీశ్‌రావు
హైదరాబాద్ : ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను ప్రభుత్వం మరింత
పటిష్ఠం చేస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద 466
అమ్మ ఒడి, అంబులెన్స్, పార్థివదేహాల తరలింపు వాహనాలను ముఖ్యమంత్రి కే
చంద్రశేఖర్‌రావు జెండాఊపి ప్రారంభించారు.
ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ఎమర్జెన్సీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం మరింత
పటిష్ఠం చేస్తోంది. తెలంగాణ వైద్యశాఖకు కొత్తగా మరో 466 వాహనాలను ప్రభుత్వం
కేటాయింది. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద అమ్మ ఒడి, అంబులెన్స్,
పార్థివదేహాల తరలింపు వాహనాలను మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి
ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ
వాణీ దేవి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి
కుమారి పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనకు
బయల్దేరారు.
అత్యవసర సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 466 అంబులెన్స్‌లను
పీపుల్స్ ప్లాజాలో సీఎం కేసీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో 108
అంబులెన్స్‌లు 204 ఉండగా అమ్మఒడి వాహనాలు 228, పార్థివదేహాలను తరలించే వాహనాలు
34 ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, సీఎస్ శాంతికుమారి, ఇతర
వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి సీఎం ఈ వాహనాలు ప్రారంభించడంతో సేవలు
అందుబాటులోకి వచ్చాయి.
ఇతర రాష్ట్రాల్లో స్కామ్‌లు..తెలంగాణలో స్కీమ్‌లు : హరీశ్‌రావు
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే
ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఎన్నికల్లో ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అమలు
చేయట్లేదు. కొన్ని రాష్ట్రాల్లో స్కామ్‌లు ఉంటే తెలంగాణలో స్కీమ్‌లు ఉన్నాయి.
కుటుంబ పెద్దగా కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. రాష్ట్రం రాక ముందు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30శాతం ప్రసవాలు జరిగేవి. ప్రస్తుతం ప్రభుత్వ
ఆస్పత్రుల్లో 70శాతం ప్రసవాలు జరుగుతున్నాయి. ఆశావర్కర్లకు సెల్‌ఫోన్
బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. వారికి స్మార్ట్ఫోన్లు ఇవ్వాలని
ప్రభుత్వం నిర్ణయించింది. 108 ఉద్యోగులకు 4 స్లాబులుగా వేతనాల పెంపు ఉంటుందని
హరీశ్‌రావు అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్కాములు ఉంటే తెలంగాణలో
స్కీములు ఉన్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న
రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన కొట్లాటలు, అవినీతి కనిపిస్తాయని విమర్శించారు.
ఆరోగ్య రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. కరోనా కంటే
పెద్ద జబ్బులు వచ్చినా రాష్ట్రం తట్టుకుంటుందని తెలిపారు. హైదరాబాద్
పీపుల్స్ ప్లాజాలో 466 అత్యవసర వాహనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఊపి
ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో కొత్తగా 466
వాహనాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి ప్రతి
లక్ష జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేదని, కాని ప్రస్తుతం 75 వేల మందికి ఒక 108
వాహనం అందుబాటులో ఉందని చెప్పారు. అమ్మఒడి వాహనాలకు నిధులు కావాలని కోరగానే
ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారని వెల్లడించారు. జననం నుంచి మరణం వరకు
వైద్య, ఆరోగ్యశాఖ సేవలు అందిస్తున్నదని చెప్పారు. వైద్యారోగ్య శాఖలో ఐదంచెల
వ్యవస్థను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని తెలిపారు. తమ మంత్రిత్వ శాఖను నీతి
ఆయోగ్ సైతం అభినందించిందని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం సంక్షేమ
పథకాలు అమలు చేయడం లేదన్నారు. కుటుంబ పెద్దగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను
అమలుచేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రం రాకముందు ప్రభుత్వ దవాఖానల్లో 30
శాతం ప్రసవాలు జరిగేవని, ఇప్పుడు ఆ శాఖ 70 శాతానికి పెరిగిందని తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రైవేటు నర్సింగ్ హోంలు మూతపడ్డాయన్నారు.
సర్కారు వైద్యంపట్ల ప్రజలకు నమ్మకం పెరిగిందని చెప్పారు. అమ్మఒడి వాహనాల
ద్వారా ప్రతిరోజు 4 వేల మంది గర్భిణులకు సేవలు అందుతున్నాయని చెప్పారు.
ఆశావర్కర్ల సెల్‌ఫోన్ బిల్లులను ఇకపై ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి
హరీశ్ అన్నారు. వారికి స్మార్ట్ఫోన్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించిందని
చెప్పారు. అంబులెన్సులను డైనమిక్ పొజిషన్ చేయాలని అనుకుంటున్నామని
వెల్లడించారు. 108 ఉద్యోగులకు నాలుగు స్లాబులుగా వేతనాలు పెంచనున్నామని
చెప్పారు.