చిన్నారికి తల్లిపాలు అందించాలి. తల్లిపాలను అందించకపోవడంతో తల్లీబిడ్డకు అనేక
సమస్యలు వస్తాయి.
రోగ నిరోధకశక్తి:
తల్లిపాలలో ప్రతిరక్షకాలు ఉంటాయి. ఇవి వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి శిశువును
రక్షిస్తాయి. తల్లిపాలు తాగడంతో చిన్నారుల్లో వ్యాధినిరోధకశక్తి బలంగా
మారుతుంది. తల్లిపాలు తాగని శిశువుల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, చెవి
ఇన్ఫెక్షన్లు వస్తాయి.
అలెర్జీలు రావు:
పుట్టిన తర్వాత చిన్నారుల్లో అలెర్జీల సమస్య అధికంగా ఉంటుంది. చిన్నారులకు
తల్లిపాలు అందించడంతో ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. తల్లిపాలు తాగడంతో
ఆస్తమా రాదు.
మెదడు పనితీరు:
తల్లిపాలు తాగడంతో చిన్నారుల్లో మెదడు పనితీరు మెరుగుపడుతుంది. తల్లిపాలు
తాగడంతో అభిజ్ఞా పనితీరును మెరుగుపడుతుంది.
జీర్ణ వ్యవస్థ:
పుట్టిన తర్వాత చిన్నారులకు తల్లిపాలు అందించడంలో వారి జీర్ణ వ్యవస్థ
ఆరోగ్యంగా మారుతుంది. తల్లిపాలు సులభంగా జీర్ణం అవుతాయి. తల్లిపాలు తాగడంతో
మలబద్ధకం, అతిసారం దరిచేరవు.
రికవరీ ఆలస్యం:
చిన్నారులకు తల్లిపాలు అందించకపోవడంతో డెలివరీ తర్వాత రికవరీ ఆలస్యం అవుతుంది.
తల్లిపాలు గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తాయి. తల్లిపాలు ఇవ్వని స్త్రీలు
రికవరీ విషయంలో చాలా ఇబ్బందులు పడతారు.
ఒత్తిడి తగ్గుతుంది:
తల్లి పాలివ్వడంతో ఆక్సిటోసిన్ ఎక్కువగా విడుదల అవుతుంది. దీంతో ఒత్తిడి
స్థాయిలు తగ్గుతాయి. తల్లిపాలు ఇవ్వకపోతే మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం
ఉంది.
రొమ్ము క్యాన్సర్ రాదు:
తల్లిపాలు అందించని వారిలో రొమ్ము, అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా
ఉంటుంది. తల్లిపాలు అందించడంతో ఈ క్యాన్సర్ ల నుంచి దూరంగా ఉండవచ్చు.
అనుబంధం:
తల్లి పాలను బిడ్డకు అందించడంలో వారి మధ్య అనుబంధం పెరుగుతుంది. పాలు
అందించడంతో ఒత్తిడి, ఆందోళన సైతం తగ్గుతుంది.