పార్కులు రోడ్లు అన్ని మా హయాంలో అభివృద్ధి చేస్తున్నాం
అభిమానులను చూపి ప్యాకేజి కోసం అమ్ముడు పోతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్
ముఖ్యమంత్రిపై పదే పదే మాట్లాడితే దేహశుద్ధి చేస్తాం
పవన్ కన్నా కె ఏ పాల్ బెటర్
విజయవాడ : స్థానిక 44వ డివిజన్ లోగల పలు ప్రజా సమస్యలు పరిష్కారానికై
శుక్రవారం మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు
అధికారులు నాయకులతో కలసి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా వెలంపల్లి
మాట్లాడుతూ ఈ రోజు 44 వ డివిజన్ లో కింద ప్రాంతం అంత పర్యటించడం
జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో అన్ని రోడ్లు అభివృద్ధి పరుస్తున్నామన్నారు. గడప
గడపకు మన ప్రభ్యుత్వం ద్వారా విడుదల అయిన నిధులతో డివిజన్ లో అభివృద్ధి పనులు
జరుగుతున్నాయన్నారు. కొండప్రాంతం మొత్తం నూతన వాటర్ పైపులైన్లు వెయ్యడం
జరిగిందన్నారు. మెట్లమార్గాలు బాగుచేశామన్నారు. పెండింగులో ఉన్న అన్ని
సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. నియోజక వర్గంలో
అన్ని రోడ్లు అభివృద్ధి చెయ్యాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. గతంలో
టీడీపీ నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. పార్కులు రోడ్లు అన్ని
మా హయాంలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ జగన్ మోహన్ రెడ్డిని ఏమి
పీకలేరన్నారు. సత్తా ఉంటె సింగిల్‌గా రా అని సవాలు విసిరారు. ముఖ్యమంత్రిపై పదే
పదే మాట్లాడితే దేహ శుద్ధి చేస్తామని హెచ్చరించారు. ప్రతి పేదవాడి ఇంట్లో ఉన్న
జగన్ మోహన్ రెడ్డి ని ఏక వచనం తో మాట్లాడితే రానున్న రోజులలో ప్రజలు పవన్ కి
తగిన రీతిలో బుద్ధి చెపుతారన్నారు. పవన్ నోరు అదుపులో పెట్టుకోకపోతే
తాటతీస్తామన్నారు. జనసేన పార్టీ పెట్టింది చంద్రబాబు కి సేవ చేసేందుకు
పెట్టాడని విమర్శించారు. దమ్ము ఉంటె 175 నియోజకవర్గలలో పవన్ పోటీ చేయాలని
సవాలు విసిరారు. అభిమానులను చూపి ప్యాకేజి కోసం అమ్ముడు పోతున్న వ్యక్తి పవన్
కళ్యాణ్ అని అన్నారు. పవన్ కన్నా కె ఏ పాల బెటర్ అన్నారు. కె ఏ పాల్ ని చూసైనా
పవన్ కళ్యాణ్ సిగ్గు తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్
మైలవరపు దుర్గారావు రత్నకుమారి, మైలవరపు కృష్ణ,యల్లంపల్లి సుబ్బారావు,లీల మధు,
గుంటుపల్లి రామదాస్,పద్ది రాజారావు, కుంభ జోజి, ఇనపకుర్తి రాము, నారాయణ, ఎద్దు
సురేష్,దుర్గారెడ్డి, వల్లెపు రాము, బోర మల్లేశ్వర రెడ్డి,అక్కిపెద్ది
శ్రీనివాస్,వళ్ళేం రవి కుమార్, అద్దేపల్లి సత్యనారాయణ, డివిజన్ పార్టీ
నాయకులు, కార్యకర్తలు, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ కన్వీనర్లు, గృహ
సారధులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.