ద్రాక్ష తినడం వల్ల కూడా ఏన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అవేంటంటే..
ఎండుద్రాక్ష గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తనాళాలు పూడుకొని
పోకుండా పదిలంగా ఉంచుతుంది.
వీటిని రాత్రిపూట నీటిలో నానపెట్టి ఉదయం తింటేచాలు. శరీరంలోని అదనపు కొవ్వు
కరుగుతుంది. రక్తప్రసరణ మెరుగవుతుంది.
గుండెకు కొవ్వు దరి చేరకుండా చూస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీంతో
అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
ఈ ఎండు ద్రాక్ష ఛాతిలో మంట, జీర్ణకోశ సంబంధ ఇబ్బందులను తగ్గిస్తుంది.
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఈ ద్రాక్షలో పీచు అధికంగా ఉంటుంది. వీటిని తినడంతో కడుపు నిండిన భావన కలిగి,
ఎక్కువు ఆహారం తీసుకోలేం. అలా బరువు పెరగకుండా ఉండొచ్చు.
కొవ్వును కరిగించే లెప్టిన్ హార్మోన్ పనితీరును ఎండుద్రాక్ష మెరుగుపరుస్తుంది.
దీంతో తొందరగా బరువు తగ్గడానికి వీలుంటుంది.
వీటిల్లో యాంటీసెప్టిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి నోటిపూత, చిగుళ్ల వాపు
తగ్గిస్తాయి. నోటిదుర్వాసన రాకుండా చూస్తాయి.
వీటిలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఎక్కువగా ఉండటంతో ఎముకలు బలంగా
తయారవుతాయి. కీళ్లవాపు నుంచి ఉపశమనం కలుగుతుంది.
రోజూ రాత్రిపూట పాలల్లో ఎండుద్రాక్ష వేసుకొని తాగితే వీర్యకణాల సంఖ్య
పెరుగుతుంది. అంగస్తంభన సమస్య తొలగిపోతుంది.