‘టైగర్ నాగేశ్వరరావు’గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నారు రవితేజ.
ఆయన హీరోగా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వంశీ తెరకెక్కించిన సంగతి
తెలిసిందే. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్
కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబరు 20న ప్రేక్షకుల
ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేస్తోంది
చిత్రబృందం. ఇందులో భాగంగా ఈ నెల 17న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ
విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా టైగర్ దండయాత్ర మొదలు
కాబోతుందంటూ ఓ పోస్టర్ ను పంచుకున్నారు. 70లలో పేరు మోసిన గజదొంగ
స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో రూపొందిన చిత్రమిది. ఇందులో
రవితేజ ఓ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్,
ఛాయాగ్రహణం: ఆర్. మదీ.