అమరావతి : ప్రతిపక్షాలు ఎంతగా అడ్డుపడినా, ఊగిపోయినా ముఖ్యమంత్రి జగన్మోహన్
రెడ్డి సారథ్యంలో జరుగుతున్న విశాఖపట్నం ఎవ్వరూ అడ్డుకోలేదని రాజ్యసభ సభ్యులు,
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. సోషల్ మీడియా
వేదికగా ఆదివారం పలు అంశాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఉమ్మడి విశాఖ
జిల్లాలో అదాని డేటా సెంటర్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, ఒబెరాయ్
హోటల్, ఇన్ఫోసిస్, బీచ్ కారిడార్, పాడేరు-నర్సీపట్నం మెడికల్ కాలేజీ విశాఖ
అభివృద్ధి కి తలమానికంగా నిలవనున్నాయని అన్నారు.
పాడి రైతులకు రికార్డు స్థాయిలో ఆదాయం
జగనన్న పాల వెల్లువ లో పాలు పోసే రైతులకు రికార్డు స్థాయిలో అదనపు ఆదాయం
అందుతోందని విజయసాయి రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనతో పాల సేకరణ ధరలు
ఏకంగా ఎనిమిది సార్లు పెరిగినట్లు తెలిపారు. గేదె పాలు లీటర్ కు గరిష్టంగా
రూ.103 కాగా ఆవు పాలు లీటర్ కు రూ.53.86 అందిస్తున్నట్లు తెలిపారు.
సత్ఫలితాలిస్తున్న విద్యారంగ సంస్కరణలు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు
సత్ఫలితాలనిస్తున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు. గడిచిన నాలుగేళ్లలో గ్రాస్
ఎన్రోల్మెంట్ నిష్పత్తి 84.4 నుంచి 100 కు చేరిందని అన్నారు. అలాగే విద్యారంగం
అభివృద్ధి కొరకు రూపొందించిన 10 స్కీంలు కింద రూ. 66.722 కోట్లు ఖర్చు
చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చేపట్టిన విద్యారంగ సంస్కరణల ద్వారా తమ
పిల్లలకు మంచి చదువులు లభిస్తున్నాయని నమ్ముతున్న వారు జగన్మోహన్ రెడ్డి
సారథ్యంలో వైకాపాను మరోమారు ఆశీర్వదించాలని కోరారు.
బీజేపీని పునరావాస కేంద్రంగా వాడుకుంటున్న పురందరేశ్వరి
బీజేపీ పార్టీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఓ పునరావాస
కేంద్రంగా వాడుకుంటున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. ఎన్ని పార్టీలు మారారో,
ఎలక్షన్ సమయానికి ఏ పార్టీలో, ఎక్కడుంటారో ఆమెకే తెలియదని అన్నారు. సనాతన
హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత ఆమెకు లేదని అన్నారు. ఆమె బంధువు, బావ
చంద్రబాబు దృష్టిలో పడేందుకే ఈ విన్యాసాలని ఆయన అన్నారు.
ఏపీలో తగ్గిన క్రైం రేటు
ఆంధ్ర రాష్ట్రంలో క్రైం రేట్ తగ్గడం మన పోలీసుల సమర్ధతను తెలియజేస్తుందని, గత
ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో క్రైం రేట్ 20% తగ్గిందని అన్నారు. ఈ మేరకు నేర
పరిశోధనలో కేంద్ర హోంశాఖ పతకాలు సాధించిన పోలీసులకు అభినందనలు
తెలియజేస్తున్నానని అన్నారు.
తన ప్రైవేట్ మెంబర్ బిల్ తో మహిళల భద్రతకు మెరుగు
ఐపీసీలో “స్నాచింగ్ ” ను ప్రత్యేక నేరంగా చేర్చేందుకు తాను ప్రవేశపెట్టిన
ప్రైవేట్ మెంబర్ బిల్ కేంద్రం కొత్తగా ప్రతిపాదించిన న్యాయ సంహిత బిల్ లో
సెక్షన్ 302 గా చేర్చడం సంతోషంగా ఉందని విజయసాయి రెడ్డి అన్నారు. దీంతో మహిళల
భద్రత మరింత పఠిష్టమవుతుందని, చైన్, పర్స్ స్నాచర్లపై కఠినమైన చర్యలు
తీసుకోబడతాయని అన్నారు.