షారుక్ ఖాన్, నయనతార జంటగా రూపొందుతున్న చిత్రం ‘జవాన్’. ఈ చిత్రానికి అట్లీ
దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా
నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం
సెప్టెంబరు 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న నేపథ్యంలో.. ప్రచార
కార్యక్రమాల జోరు పెంచుతోంది చిత్రబృందం. అందులో భాగంగా సోమవారం ‘ఛలోనా..’ అనే
పాటను విడుదల చేశారు. ఈ పాటలో షారుక్, నయనల మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని
నెటిజన్ లు స్పందించారు. దీనికి అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. రెడ్
చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గౌరీఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
స్టార్ కథానాయిక దీపిక పదుకొణె ఇందులో అతిథి పాత్రలో మెరవనున్నారు.