వైమానిక దళ వీరుల కథతో వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం
తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన మానుషి చిల్లర్ కథానాయికగా నటిస్తోంది.
శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. రినైసన్స్ పిక్చర్స్
సంస్థతో.. కలిసి సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ ఈ సినిమాని
రూపొందిస్తోంది. సందీప్ ముద్దా నిర్మాత. ఈ చిత్రానికి ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే
పేరుని ఖరారు చేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు డిసెంబరు 8న సినిమాని విడుదల
చేస్తున్నట్టు సోమవారం సినీ వర్గాలు ప్రకటించాయి. తెలుగు, హిందీ భాషల్లో
ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వరుణ్ ఎయిర్‌పోర్స్ పైలట్ గా
కనిపించనున్నారు. వైమానిక దళ వీరుల అలుపెరగని స్ఫూర్తిని వైమానిక దాడుల సమయంలో
వాళ్లు ఎదుర్కొనే సవాళ్లని ఉత్కంఠ భరితంగా తెరపై ఆవిష్కరిస్తున్నాం. వాస్తవ
ఘటనల స్ఫూర్తితో… దేశభక్తి నిండిన అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ‘మేజర్’
తర్వాత సోనీ పిక్చర్స్ సంస్థ నుంచి వస్తున్న మరో దేశభక్తి ప్రధానమైన కథ ఇది.
సీటు అంచున కూర్చోబెడుతూ ప్రేక్షకులకి థ్రిల్ ను పంచుతుంది. అనుభవమజ్ఞుడైన
ఛాయాగ్రాహకుడు, విజువల్ ఎఫెక్ట్స్ రంగ నిపుణుడైన శక్తిప్రతాప్ సింగ్ హడా…
సిద్ధార్థ్ రాజ్‌కుమార్, ఆమీర్ ఖా నాతో కలిసి ఈ కథని రాశారు. తప్పకుండా
ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని సినీ వర్గాలు తెలిపాయి.