విజయవాడ : ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతి
వేడుకలు విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో బుధవారం వైభవంగా నిర్వహించారు. ఈ
సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విజయభాస్కర్ రెడ్డి చిత్ర
పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా,
కేంద్రమంత్రిగా పేదలకు, కోట్ల చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశంలోనే
తొలిసారి రూ.1.90కు కేజీ బియ్యాన్ని పేదలకు అందించిన సంక్షేమ పథకాన్ని ఆయనే
ప్రారంభించారని పీసీసీ అధ్యక్షులు రుద్రరాజు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తన
రాజకీయ జీవితంలో ఎటువంటి అవినీతికి పాల్పడకుండా నీతివంతమైన ప్రజా నాయకుడిగా
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీచే మన్ననలు పొందారని గుర్తు చేశారు. కోట్ల ఆదర్శంగా
అందరం ముందుకు వెళ్తామని రుద్రరాజు వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర
కార్యనిర్వహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, విజయవాడ జిల్లా కాంగ్రెస్
అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ఎన్జీఆర్ జిల్లా అధ్యక్షులు బుర్రా కిరణ్
కుమార్, ఏఐసీసీ సభ్యులు ధనేకుల మురళి, మేడా సురేష్, మీసాల రాజేశ్వరరావు, లీగల్
సెల్ రాష్ట్ర ఛైర్మన్ వి.గుర్నాధం, వైస్ ఛైర్మన్ డాక్టర్ జంధ్యాల శాస్త్రి,
సీనియర్ నేతలు బైపూడి నాగేశ్వరరావు, ఖాజా మోహిద్దీన్, పి వై కిరణ్, పి.
నాంచారయ్య, బేగ్, షేక్ నాగూర్, ఖుర్షీదా, అన్సారీ, ఇమ్రాన్, ఏసు దాసు, పలువురు
పాల్గొన్నారు.