ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ అంకుర హాస్పిటల్ ఫర్ ఉమెన్ & చిల్డ్రన్,
ఆంధ్రప్రదేశ్‌లోని భద్రాచలం దగ్గర జరిగిన ఒక ప్రమాదం లో తీవ్రంగా గాయపడి
ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొన్న 10 ఏళ్ల బాలికకు విజయవంతంగా చికిత్స
అందించడంతో పాటుగా కోలుకునేలా చేయటం ద్వారా అద్భుతమైన ఘనతను సాధించింది.
ఇంటెన్సివిస్ట్ డాక్టర్ ఎం. రవి కుమార్ మరియు డాక్టర్. పి. అనురూప,
పీడియాట్రిక్ సర్జన్ , డాక్టర్. ఎం. వరుణ్ కుమార్, ఆర్థోపెడిక్ సర్జన్ ,
డాక్టర్. కె. సాయికృష్ణ, మత్తు వైద్య నిపుణులు డాక్టర్. పి.నాగరాజు తో సహా
అంకుర హాస్పిటల్ ఫర్ ఉమెన్ & చిల్డ్రన్ వద్ద నున్న నిష్ణాతులైన వైద్య బృందం
వెంటనే రోగిని వద్ద హాజరు కావటం తో పాటుగా ఆ బాలిక ను కాపాడటానికి తమ
ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా రక్తస్రావం ఆపడానికి తగిన చర్యలు తీసుకోవటం
తో పాటుగా రోగి ఆరోగ్య స్థితిని స్థిరీకరించి, ఆపై అత్యంత క్లిష్టమైన
శస్త్రచికిత్సా విధానాలను నిర్వహించి ఆమె ప్రాణాలను కాపాడారు. తలకు
తీవ్రగాయాలు కావడంతో పాటుగా తీవ్ర రక్తస్రావమై బాలిక పరిస్థితి విషమంగా
ఉండడంతో ఆమె ను అంకుర హాస్పిటల్ కు తీసుకొచ్చారు. ఆమె ఎడమ భుజం మరియు ఎడమ
తొడ భాగం లో ఎముకలకు గాయాలయ్యాయి. అలాగే పెరినియల్( మలద్వారం నుంచి జనానావయాల
మధ్య భాగం) ప్రాంతంలో పెద్ద మొత్తంలో మృదు కణజాల నష్టం కూడా జరిగింది.
అత్యున్నత నైపుణ్యం కలిగిన వైద్య బృందం వెంటనే ఆమె ఆరోగ్య స్థితి నిలకడగా
ఉంచటానికి తగిన ప్రయత్నాలు ప్రారంభించింది. అంకుర హాస్పిటల్ బృందం, ఆ బాలికను
బ్రతికించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తూ, ఆమె రక్తపోటును మెరుగుపరచడం,
రక్తస్రావం అరికట్టడం, మూత్ర విసర్జనకు మార్గాన్ని సృష్టించడంపై దృష్టి
సారించింది. ఈ బాలికను మెకానికల్ వెంటిలేటర్‌పై ఉంచారు. ఆమె ఆరోగ్యానికి
మరింత నష్టం కలిగించకుండా ఆమె ఎముకలకు అయిన గాయాలకు తగిన చికిత్స చేశారు. ఆమె
గాయాలకు అవసరమైన భారీ శస్త్రచికిత్సలు చేయక మునుపే, నిలకడగా ఆమె ఆరోగ్య
స్థితిని స్థిరీకరించడానికి పలుమార్లు రక్తము నెక్కించుట కూడా చేశారు.
బాలిక ఆరోగ్య స్థితిని నిలకడ గా చేసిన తరువాత, ఆమె మూత్ర మార్గం మరియు పాయువు
(యానల్) లు తెరుచుకునేందుకు తగినట్టు గా ఐదు గంటలపాటు శస్త్రచికిత్స చేశారు.
శస్త్రచికిత్స అనంతర సంరక్షణ ద్వారా శస్త్రచికిత్సా బృందం ఆమె రక్షణకు భరోసా
కల్పించింది, ఆ సమయంలో ఆమె గాయాలు వేగంగా నయం అయ్యాయి. ఐదు రోజుల తర్వాత, రోగి
విజయవంతంగా వెంటిలేటర్ నుండి విముక్తి పొందింది, ఆమె సాధారణ మరియు నాడీ
సంబంధిత పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. అంకుర హాస్పిటల్ యొక్క
ప్రత్యేక బృందం అందించిన యాక్టివ్ న్యూరో రిహాబిలిటేషన్, ఆమె అత్యంత ప్రమాదకర
స్థితి నుంచి కోలుకోవడంలో కీలక పాత్ర పోషించింది. ఈ కేసు గురించి విజయవాడలోని
అంకుర హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి.వి.విజయ్ కుమార్ మాట్లాడుతూ
అపస్మారక స్థితి నుండి ఆసుపత్రి సంరక్షణలో పూర్తి సాధారణ స్థితికి
చేరుకోవడంలో , ఆ బాలిక పురోగతి అసాధారణతకు తక్కువ ఏమీ కాదు. దాదాపుగా ఆమె
సాధారణ స్థితికి తిరిగి రావడానికి కనీసం ఆరు వారాల రీహాబిలిటేషన్ అవసరమైంది.
తీవ్రమైన అనారోగ్యంతో బాధ పడుతున్న పిల్లల ఆరోగ్య నిర్వహణలో ప్రభావవంతమైన
సమిష్టి కృషి, అత్యున్నత నాణ్యత కలిగిన వైద్య సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను,
ఆమె పరివర్తన నొక్కి చెబుతుంది, రోగుల శ్రేయస్సు పట్ల ఆసుపత్రి నిబద్ధతకు ఈ
విజయం ఒక నిదర్శనమ ని అన్నారు.
అంకుర హాస్పిటల్ ఫర్ ఉమెన్ & చిల్డ్రన్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్
డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ రావు వున్నం మాట్లాడుతూ మరో బిడ్డ ప్రాణాన్ని
కాపాడినందుకు మేము చాలా ఆనందం గా వున్నాము. అత్యంత క్లిష్టమైన పరిస్థితిల
నుండి ఈ బాలిక కోలుకోవడం మా వైద్య బృందం యొక్క అంకితభావానికి, నైపుణ్యానికి
నిదర్శనం. ‘గోల్డెన్ అవర్’లో వేగవంతమైన మరియు సమగ్రమైన పాలి ట్రామా నిర్వహణ
యొక్క ఆవశ్యకతను ఈ కేసు ప్రధానంగా వెల్లడిస్తుంది. అంకుర హాస్పిటల్లో
నిపుణులైన వైద్యుల బృందం ఉంది, ఈ తరహా కేసులను విజయవంతంగా నిర్వహించడానికి
లెవల్ 3 ఎన్ ఐ సి యు లు గ్రీన్ ఆపరేటింగ్ థియేటర్ల యొక్క అత్యుత్తమ-శ్రేణి
మౌలిక సదుపాయాలను కలిగి ఉండటం తో పాటుగా క్లిష్టమైన ట్రామా కేసులను
నిర్వహించడానికి శిక్షణ పొందామని అన్నారు.