కొవ్వూరు : గతంలో ఏ ముఖ్యమంత్రి అందించలేనంత సంక్షేమం రాష్ట్రంలో ఈ నాలుగేళ్ల
లో సీఎం వై.యస్. జగన్ మోహన్ రెడ్డి అందించారని రాష్ట్ర హోంమంత్రి, ప్రకృతి
విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గడప గడపకు మన
ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 121వ రోజు కొవ్వూరు పట్టణం 2వ వార్డులో
హోంమంత్రి గురువారం పర్యటించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులతో ఆప్యాయంగా
మాట్లాడుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. వివిధ సంక్షేమ
పథకాల ద్వారా వారి కుటుంబాలకు ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని కుటుంబ సభ్యులకు
వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని
సచివాలయ సిబ్బంది, అన్ని శాఖల అధికారులను హోంమంత్రి తానేటి వనిత ఆదేశించారు. ఈ
సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అర్హత ప్రామాణికంగా ప్రతి
కుటుంబానికి సంక్షేమం అందిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాల గురించి
తెలుసుకోవడానికి ఏ ఇంటికి వెళ్లినా ప్రజల్లో సంతోషమే కనపడుతోందన్నారు. జగనన్న
ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి కనీసం లక్ష
రూపాయల నుండి పది లక్షల వరకు లబ్ధి చేకూరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో
స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.