ఫ్రాంక్ఫర్ట్ : జర్మనీలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయమైన ఫ్రాంక్ఫర్ట్
విమానాశ్రయం వరదల్లో చిక్కుకోవడంతో అక్కడ సేవలు నిలిచిపోయాయి. పలు విమానాలను
రద్దు చేశారు. ఫ్రాంక్‌ఫర్ట్‌కు రావాల్సిన విమానాలను దారిమళ్లించారు. బుధవారం
రాత్రి నుంచి ఇక్కడ ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో రన్‌వేపైకి మోకాలి
లోతు నీరు చేరింది. టెర్మినల్‌లోని ఎస్కలేటర్, దుకాణాల్లోకి వాన నీరు
వచ్చింది. వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అటు నగరంలోని పలు
లోతట్టు ప్రాంతాలు కూడా నీట మునిగాయి. గంట వ్యవధిలోనే సుమారు 25,000 మెరుపులు
వచ్చాయంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరోవైపు, రానున్న రోజుల్లోనూ మరిన్ని
భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్థానిక వాతావరణశాఖ అధికారులు
హెచ్చరిస్తున్నారు.