రోమ్ : ఇటలీలో ఆకస్మికంగా సంభవించిన వరదలు ఊహించని నష్టాన్ని మిగిల్చాయి.
స్థానికంగా ఓ పట్టణంలో ఎటు చూసినా బురద మేటలే దర్శనమిచ్చాయి. భారీ వర్షాల
కారణంగా మెర్డోవిన్ నది ఉప్పొంగి ప్రవహించింది. దీనికి తోడు సమీప పర్వత
ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. తీరప్రాంత పట్టణమైన బార్డోనెషియాలో
ఒక్కసారిగా మెరుపు వరద ప్రవేశించింది. పెద్దఎత్తున బురద ప్రవాహం వీధులను
ముంచెత్తింది. అప్రమత్తమైన పౌరులు రోడ్ల వెంబడి పరుగులు తీశారు. ఇందుకు
సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వరదల ధాటికి
పట్టణంలో చెట్లు కూలిపోవడంతోపాటు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు,
కార్యాలయాలు చెత్తాచెదారం, బురదతో నిండిపోయాయి. మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం
వాటిల్లినట్లు స్థానిక గవర్నర్ తెలిపారు. ప్రాణనష్టాన్ని నివారించినట్లు
వెల్లడించారు.