ఇప్పుడు తెలుసుకుందాం..
1.యాపిల్ మెదడును చురుగ్గా మార్చేస్తుంది. మతిమరపుకి కారణమయ్యే అల్జీమర్స్
వ్యాధిని నివారిస్తూ, మెదడుకి రక్షణనిస్తుంది.
2.నరాలపై ప్రభావం చూపే, పార్కిన్సన్స్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.
3.కంటి చూపును కాపాడుతుంది. కంటి చూపును మెరుగుపరచి, రేచీకటి రాకుండా
చేస్తుంది. ఈ పండులోని ఫ్లేవనాయిడ్స్, యాంటీఆక్సిడెంట్ ఫైటోన్యూట్రియంట్స్
సూక్ష్మజీవుల నుంచీ కళ్ల హాని జరగకుండా కాపాడతాయి.
4.యాపిల్ విటమిన్-సి ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధకశక్తిని మరింత పెంచుతుంది.
తద్వారా ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
5.యాపిల్‌లోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్ కేన్సర్ భారీ నుంచి కాపాడతాయి.
మిగతా పండ్లతో పోల్చితే పాంక్రియాస్ కేన్సర్ ముప్పు నుంచి రక్షణ కల్పించే గుణం
యాపిల్‌లో 23 శాతం ఎక్కువ అని అమెరికన్ అసోసియేషన్ ఫర్ కేన్సర్ రీసెర్చ్
పరిశోధనల్లో తేలింది.
6.యాపిల్ కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం ఉంది. అందువల్ల రక్తనాళాల ఆరోగ్యం
మెరుగయ్యి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. యాపిల్ మంచి డీ-టాక్సిఫైయింగ్ ఏజెంట్
కూడా. ఇది మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటైన కాలేయంలోని విషాల్ని
విజయవంతంగా తొలగిస్తుంది.
7.యాపిల్ లోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్స్ మన చర్మ కణాల్ని కాపాడతాయి.
ముడతలు, మచ్చల వంటివి రాకుండా చేస్తాయి. మృత కణాల్ని తొలగించడమే కాదు. పాడైన
కణాల్ని సరిచేస్తుంది కూడా. ఈ గుజ్జులో తేనెను కలిపి చర్మానికి పట్టిస్తే,
యవ్వన ఛాయలతో మెరిసే చర్మాన్ని పొందొచ్చు.
8.ఇందులోని పీచు అధిక బరువును తగ్గించేందుకు తోడ్పడుతుంది.
9.యాపిల్ కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం ఉంది. అందువల్ల రక్తనాళాల ఆరోగ్యం
మెరుగయ్యి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
10.యాపిల్ మంచి డీ-టాక్సిఫైయింగ్ ఏజెంట్ కూడా. ఇది మన శరీరంలో అత్యంత ముఖ్యమైన
అవయవాల్లో ఒకటైన కాలేయంలోని విషాల్ని విజయవంతంగా తొలగిస్తుంది. ఇన్ని
ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే, రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన
పని ఉండదంటున్నారు పరిశోధకులు. వీటిని తినడం ద్వారా చాలా రకాల రోగాల బారిన
పడకుండా తప్పించుకోవచ్చు.