మరో నాలుగేళ్లలో ఇన్ని సినిమాలు చేయాలి, ఇంత సంపాదించాలి అనే లక్ష్యాలు నాకేం
లేవు. ప్రశాంతంగా పని చేసుకుపోవడమే నాకిష్టం అంటోంది శ్రుతిహాసన్. ప్రస్తుతం
‘సలార్’ చిత్రంలో ప్రభాస్ సరసన నటిస్తోంది. శ్రుతి హాసన్ మాట్లాడుతూ “నేనెన్ని
సినిమాలు చేశాను? ఎంత సంపాదించాను? అనేది ఎప్పుడూ లెక్కలేసుకోలేదు. జరిగిపోయిన
విషయాలకు నేనంతగా ప్రాధాన్యం ఇవ్వను. భవిష్యత్తుని ఊహించుకొంటూ బతికేయడం కూడా
నాకు ఇష్టం లేదు. మనం ప్లాన్ చేసుకొన్నంత మాత్రన అన్నీ జరిగిపోవు. నేను
ఊహించని అవకాశాలు నా చేతికి అందినప్పుడే ఎక్కువ కిక్ ఉంటుంది. దాన్ని
నేనెప్పుడూ ఆస్వాదిస్తుంటాను. ప్రతీ రోజూ కొత్తగా ఉండాలి. అలా ఉండాలంటే ఏ
రోజునీ ప్లాన్ చేసుకోకూడదు. అదే నా ఫిలాసఫీ” అంటోంది.