‘సూర్యాపేట ప్రగతి నివేదిన సభలో తెలంగాణ సీఎం కేసీఆర్
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కావడమే ఒక చరిత్ర అని, చాలా అభివృద్ధి
చెందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్,
సమీకృత వ్యవసాయ మార్కెట్, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ, భారాస
జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
‘‘ మానవ అభివృద్ధి సూచికలో రాష్ట్రం మంచి స్థానంలో ఉండటం గర్వకారణం. తలసరి
ఆదాయం, విద్యుత్ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నాం. రూ.100 కోట్లతో ప్రభుత్వ
కార్యాలయ భవనాలు నిర్మించుకున్నాం. ఇంత అద్భుతమైన కలెక్టరేట్లు, పోలీసు భవనాలు
ఎక్కడా లేవు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు కూడా మన కలెక్టరేట్ల వలే లేవు.
రాష్ట్రంలో ఆకలి లేని రోజులు తెచ్చుకున్నాం. జట్టు కట్టి, పట్టుపట్టి
పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చూపిస్తున్నాం. ఎక్స్‌లెన్స్ దశకు చేరుకున్నాం,
ఇంకా ముందుకు వెళ్లాలి. తెలంగాణ జీరో ఫ్లోరైడ్ రాష్ట్రమని కేంద్రమే
ప్రకటించిందిని సీఎం కేసీఆర్ వివరించారు.
త్వరలోనే పింఛన్ల పెంపుపై ప్రకటన : ఎన్నికలు రాగానే కొత్త బిచ్చగాళ్లు వచ్చి
మాయమాటలు చెబుతారు. ప్రజలు నమ్మొద్దని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్, సమీకృత వ్యవసాయ మార్కెట్, జిల్లా ఎస్పీ
కార్యాలయం, మెడికల్ కాలేజీ, భారాస జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘సూర్యాపేట ప్రగతి నివేదిన సభలో
సీఎం మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్క అవకాశం ఇవ్వాలని
అడుగుతున్నారు. 50 ఏళ్లు అవకాశం ఇస్తే ఏం చేశారు. కాంగ్రెస్ పార్టీలో
జిల్లాకు చెందిన చాలా మంది మంత్రులుగా పనిచేశారు.. సూర్యాపేటను అభివృద్ధి
చేశారా? సూర్యాపేట, భువనగిరి, నల్గొండలో మెడికల్ కాలేజీలు పెట్టాలని
ఎప్పుడైనా అనుకున్నారా? సూర్యాపేట, నల్గొండ గతంలో ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా
ఉన్నాయి. ఎన్నికలు రాగానే కొత్త బిచ్చగాళ్లు వచ్చి మాయమాటలు చెబుతారు. ప్రజలు
ఆగం కావొద్దు. రూ.4వేలు వృద్ధాప్య పింఛను ఇస్తామని కాంగ్రెస్ నేతలు
చెబుతున్నారు. వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో రూ.4వేలు పింఛను ఇస్తున్నారా?
కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రానికో విధానం ఉంటుందా?. మేం కూడా పింఛన్లు
తప్పకుండా పెంచుతాం. పింఛన్లు ఎంతకు పెంచుతానో త్వరలోనే చెబుతా.
భారాస విజయంపై అనుమానమే లేదు : అంచెలంచెలుగా సంక్షేమ పథకాలు పెంచుకుంటూ
పోతున్నాం. ఒక పార్టీ నాయకుడు మోటార్లకు మీటర్లు పెట్టాలంటాడు..మరో పార్టీ
నాయకుడేమో 3 గంటల కరెంటు చాలంటాడు. కాంగ్రెస్ గెలిచిన కర్ణాటకలో అప్పుడే
విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఇవాళ తెలంగాణలో పండే వడ్లను తరలించేందుకు లారీలు
సరిపోవట్లేదు. కాంగ్రెస్ ఆపద్బంధు పథకం, భారాస రైతు బీమాను పోల్చి చూడాలి.
ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా రైతు బంధు, రైతు బీమా డబ్బు ఖాతాలో పడుతోంది. ధరణి
రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ధరణి పోర్టల్ తీసేస్తే రైతు
బంధు, రైతు బీమా ఎలా వస్తుంది. ఒక్కసారి ధరణిలో భూమి నమోదైతే మార్చే మొనగాడు
ఉన్నారా? మండల కేంద్రంలోనే 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ అయ్యేలా ధరణి
తెచ్చాం. ఓటు అనే ఆయుధాన్ని బాగా ఆలోచించి వాడుకోవాలి. ఉమ్మడి నల్గొండ
జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు భారాస గెలవాలి. భారాస విజయంపై అనుమానమే లేదు.
గత ఎన్నికలకంటే ఈసారి ఐదారు సీట్లు ఎక్కువే వస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు.
సూర్యాపేటకు సీఎం కేసీఆర్ వరాలు : సూర్యాపేటకు సీఎం కేసీఆర్ వరాలు
ప్రకటించారు. ‘‘ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు, జిల్లాలోని 4
మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు, సూర్యాపేట మున్సిపాలిటీకి రూ.50కోట్లు మంజూరు
చేస్తున్నా. రూ.25 కోట్లతో సూర్యాపేటలో కళాభవన్ నిర్మిస్తాం. సూర్యాపేటలో
ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నిర్మించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డిని
ఆదేశిస్తున్నానని సీఎం కేసీఆర్ తెలిపారు.