అగ్ర కథానాయిక కీర్తి సురేష్ తెలుగులో మరో అవకాశం అందుకున్నట్లు సమాచారం. యువ
హీరో నాగచైతన్యతో ఈ చెన్నై సుందరి జోడీ కట్టబోతున్నదని వార్తలు
వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. నాగచైతన్య హీరోగా చందు మొండేటి
దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ పతాకంపై
బన్నీ వాసు నిర్మించనున్నారు. మత్స్యకారుల నేపథ్య కథాంశంతో యథార్థ ఘటనల
స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో కథానాయిక ఎంపిక
కోసం చిత్ర బృందం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. తాజా సమాచారం
ప్రకారం కీర్తి సురేష్, సాయిపల్లవి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కీర్తి
సురేష ను ఖరారు చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలిసింది. త్వరలో ఈ చిత్రం
సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇటీవల విడుదలైన ‘భోళా శంకర్’ చిత్రంలో చిరంజీవి
చెల్లెలుగా చక్కటి అభినయంతో ఆకట్టుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ భామ
తమిళంలో నాలుగు చిత్రాల్లో నటిస్తున్నది.