మొదటి దశలో యువతకు 50 వేల ఉద్యోగాలు * 500 ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలకు
అవకాశం * సెప్టెంబర్ 2,3 తేదీల్లో జాబ్ మేళా నిర్వహణ * వివరాలు వెల్లడించిన
పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ * పార్టీ నేతలతో కలిసి “బీసీవై ఉద్యోగాల సంబరం”
పోస్టర్ ఆవిష్కరణ * 2024 ఎన్నికల్లో మాత్రం బీసీవై పార్టీ కీలక భూమిక * భారత
చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్
విజయవాడ : రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య వేధిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారమే
ఆంధ్ర ప్రదేశ్ లో సుమారుగా 13 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు అంచనా.
దశాబ్దాల నుండి రాజకీయం చేస్తున్న ప్రధాన పార్టీలు వారిని ఓటు బ్యాంకుగా
చూస్తున్నాయి, తప్ప భవితను బాధ్యత స్వీకరించడం లేదు. అందుకే రాష్ట్ర యువత
భవితను తీర్చిదిద్దే మహత్తర బాధ్యతను భుజాన వేసుకున్న “భారత చైతన్య యువజన
పార్టీ” భారీ ఉద్యోగాల సంబరం నిర్వహించనుంది. మొదటి దశలో సుమారు 500
కంపెనీల్లో 50 వేలకు పైగా ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా సెప్టెంబర్ 2,3 తేదీల్లో
ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది. ఈ పూర్తి వివరాలను సోమవారం పార్టీ అధినేత
రామచంద్ర యాదవ్ మీడియాకు వెల్లడించారు. పార్టీ నేతలతో కలిసి “బీసీవై ఉద్యోగాల
సంబరం” పోస్టర్ ఆవిష్కరించారు. మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ లో సెప్టెంబర్
2,3 తేదీల్లో జరిగే ఇంటర్వ్యూల్లో అదే రోజు ఎంపికైన వారికి నియామక పత్రాలు
అందించడం జరుగుతుందన్నారు. 18 నుండి 35 సంవత్సరాల వయస్సు మధ్యలోని ఎస్ ఎస్ సీ
నుండి డిగ్రీ, పిజీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదివిన నిరుద్యోగులు ఈ జాబ్
మేళాలో పాల్గొనవచ్చని, ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకుని ఇంటర్వ్యూలకు హజరు
కావాలని చెప్పారు. అర్హతలను బట్టి రూ. 13 వేల నుండి రూ. లక్షన్నర వరకూ వేతనం
లభించే ఉద్యోగాలు ఈ జాబ్ మేళాలో పొందవచ్చని చెప్పారు.
జగన్ అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి : రామచంద్ర యాదవ్ ధ్వజం
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రభుత్వ వైఖరి, సీఎం పాలన, రెండు
పార్టీల తీరుపై బీసీవై అధినేత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. ఈ నాలుగేళ్లలో
ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేని అసమర్థ చేతగాని ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే
అది జగన్మోహనరెడ్డి సర్కారేనని విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి లేక
యువతీ యువకులు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా, సర్కారు
పెద్దల అవినీతి దాహానికి యువత మత్తు పదార్ధాలను బానిసలు అయ్యేలా తయారు
చేస్తున్నారని విమర్శించారు.. దీని వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతోందని
ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహనరెడ్డి తన రాజకీయ
స్వార్ధం కోసం రెండు లక్షల 50 వేల మంది వాలంటీర్ల భవిష్యత్తును నాశనం
చేస్తున్నారని విమర్శించారు. నేడు సమాజంలో చిన్న చిన్న కూలీ నాలి పనులు
చేసుకునే వారు కూడా రూ. 15 వేల నుండి 30 వేల వరకూ సంపాదించుకుంటుంటే డిగ్రీ,
పీజీలు చేసిన వారు కేవలం రూ. 5 వేల జీతంతో వాలంటీర్లుగా వారి భవిష్యత్తు
లేకుండా అయిపోతుందనీ దీన్ని వాలంటీర్లు తెలుసుకోవాలన్నారు. జగన్మోహనరెడ్డి తన
రాజకీయ స్వార్ధంతో వారి సేవలను అలా వినియోగించుకుంటూ వారి భవిష్యత్తును నాశనం
చేస్తున్నారని దుయ్యబట్టారు.
పారిశ్రామిక అభివృద్ధి ఎక్కడ..? : రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని
పూర్తిగా పక్కన పెట్టేశారని రామచంద్ర యాదవ్ విమర్శించారు. ఇన్వెస్టిమెంట్
సమ్మిట్ల పేరిట లక్షల కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చారనీ, రూ.13 లక్షల కోట్ల
రూపాయల ఇన్వెస్టిమెంట్ లు వస్తాయని అర్భాటంగా ప్రకటించుకున్నారనీ, కానీ రూ. 13
లక్షల రూపాయల ఇన్వెస్ట్ మెంట్ లు కూడా రాని పరిస్థితి ఉందన్నారు. దీనికి కారణం
రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా లేదని కాదనీ రాష్ట్రంలో అన్ని
రకాల వనరులు ఉన్నప్పటికీ ప్రభుత్వ దోపిడీ, పెద్దల దోపిడీ, వేధింపుల వల్ల
కావచ్చు కొత్త కంపెనీలు, పరిశ్రమలు వెనుకడుగు వేస్తున్నాయన్నారు. రాష్ట్రం
బాగుపడాలని, యువత భవిష్యత్తు మెరుగుపడాలని భారత చైతన్య యువజన పార్టీ ఒక
ప్రత్యేక ప్రణాళిక తీసుకురావడం జరిగిందన్నారు. వీటిని పార్టీ మేనిఫెస్టోలో
ప్రకటించడం జరిగిందని చెప్పారు. యువత కోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు
చేయడం ద్వారా అయిదు సంవత్సరాల ప్రణాళిక ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో డిగ్రీ
చేసిన విద్యార్ధికి ప్రత్యేక స్కిల్ డవలప్ మెంట్ సెంటర్ ల ద్వారా ఉద్యోగం
వచ్చే వారికి శిక్షణ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఏటా
కనీసం వెయ్యి స్టార్టప్ కంపెనీలను తీసుకురావడం ద్వారా 50 వేల నుండి లక్ష మంది
యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. చైనా తరహా
పారిశ్రామిక ప్రణాళిక ఏపీలో తీసుకువస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో 175
నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తామని రామచంద్రయాదవ్ చెప్పారు. ఎన్నికల
నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎన్ని స్థానాల్లో పోటీ చేయడం జరుగుతుందని అనే
విషయాలను వెల్లడిస్తామన్నారు. 2024 ఎన్నికల్లో మాత్రం తమ పార్టీ కీలక భూమికను
పోషిస్తుందని వెల్లడించారు. వైసీపీ సర్కార్ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి
లేదని స్పష్టం చేశారు.