‘కేజీఎఫ్’ సిరీస్ చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హై ఇంటెన్సిటీ
యాక్షన్, ఎమోషన్స్, ఎలివేషన్స్ లో దర్శకుడు ప్రశాంతి నీల్ ప్రేక్షకులకు కొత్త
అనుభూతిని అందించాడు. దీంతో ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో
తెరకెక్కిస్తున్న ‘సలార్’ చిత్రం కోసం సినీప్రియులు ఆసక్తిగా
ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ అంచనాలను పెంచింది. ఈ
సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఈ
సినిమా యాక్షన్ ఘట్టాలు ‘కేజీఎఫ్’ను మించి ఉంటాయని, క్లైమాక్స్ లో వెయ్యి
మందితో ప్రభాస్ తలపడతాడని చెబుతున్నారు. ఈ సినిమా యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ
తనను అశ్చర్యానికి గురిచేసిందని ప్రభాస్ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో తన
అనుభవాలను పంచుకున్నారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్
నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడుదల కానుంది.