రవితేజ కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కుతోన్న చిత్రం
ఈగల్. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ కథానాయికలుగా నటిస్తున్నారు. నవదీప్,
మధుబాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం
వహిస్తుండగా, టి. జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల
ముందుకు తీసుకు రావడమే లక్ష్యంగా చిత్రబృందం ఈ సినిమా కి సంబంధించిన
చిత్రీకరణను పరుగులు పెట్టిస్తోంది. ఈ షెడ్యూల్ లో భాగంగా లండన్ లో రవితేజ,
ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు సినీ వర్గాలు
తెలిపాయి. రవితేజ చిత్రంలో భిన్న కోణాల్లో సాగే పాత్రని పోషిస్తున్నారు.
భారీబడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపుదిద్దుతున్నారు. ఈ సినిమాకి దవాంద్ స్వరాలు
అందిస్తున్నారు. సంభాషణలు: మణిబాబు కరణం.