మిషన్ తుది ఘట్టానికి చేరుకుంది. నేడు ల్యాండింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో
లార్సెన్ & టూబ్రో , మిశ్ర ధాతు నిగమ్ , భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ తో
సహా పలు లిస్టెడ్ కంపెనీల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ‘చంద్రయాన్-3’ మిషన్‌లో
ఈ మూడు కంపెనీలు కీలక పాత్ర పోషించాయి. అలాగే హిందుస్థాన్ ఏరోనాటిక్స్,
వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ సంస్థలు వివిధ దశల్లో
మిషన్‌కు సహకరించాయి. ‘చంద్రయాన్-3’ ల్యాండింగ్ విజయవంతమైతే స్టాక్
మార్కెట్లో ఈ కంపెనీల షేర్లు అమాంతం పెరుగుతాయి.
ఎల్అండ్టీ పాత్ర : ఎల్వీఎం3 ఎం4 చంద్రయాన్ మిషన్ ప్రయోగంలో ఎల్అండ్టీ
కీలక పాత్ర పోషించింది. 3.2 మీటర్ల వ్యాసం కలిగిన హెడ్ ఎండ్ సెగ్మెంట్, మిడిల్
సెగ్మెంట్, నాజిల్ బకెట్ ఫ్లాంజ్ అనే క్లిష్టమైన బూస్టర్ భాగాలు పోవైలోని
ఎల్అండ్టీ కర్మాగారంలో తయారయ్యాయి. ఇక్కడే వీటిని పరీక్షించారు. అలాగే
కోయంబత్తూరులోని ఎల్అండ్టీ హై-టెక్ ఏరోస్పేస్ తయారీ కేంద్రంలో గ్రౌండ్,
ఫ్లైట్ అంబిలికల్ ప్లేట్లు తయ్యారయ్యాయి. ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ కోసం
లాంచ్ వెహికల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్‌లో కూడా ఎల్అండ్టీ పాత్ర ఉంది.
మిదాని నుంచి లోహ మిశ్రమాలు : మిశ్ర ధాతు నిగమ్ విషయానికొస్తే కోబాల్ట్
చంద్రయాన్-3 మిషన్‌కు అవసరమైన నికెల్, టైటానియం లోహ మిశ్రమాలు, ప్రత్యేకమైన
ఉక్కు, ఇతర క్లిష్టమైన పదార్థాలను అభివృద్ధి చేసి సరఫరా చేయడంలో కంపెనీ పాత్ర
పోషించింది. ఈ సంస్థ భవిష్యత్తులో ఇస్రో జరిపే ప్రతిష్టాత్మక గగన్‌యాన్
మిషన్‌తోపాటు ఇతర మార్గదర్శక కార్యక్రమాలకు కూడా కీలక సహకారం అందించనుంది.
బ్యాటరీలు సరఫరా చేసిన బీహెచ్ఈఎల్ : చంద్రయాన్-3కి సంబంధించిన బ్యాటరీలను
బీహెచ్ఈఎల్ సరఫరా చేసింది. బీహెచ్ఈఎల్కు చెందిన వెల్డింగ్ రీసెర్చ్
ఇన్స్టిట్యూట్ (WRI) చంద్రయాన్-3 కోసం బై-మెటాలిక్ అడాప్టర్లు తయారీ
చేసింది. మీడియా నివేదిక ప్రకారం.. ఎల్వీఎం3 ఎం4 ఫ్లైట్ చంద్రయాన్-3
క్రయోజెనిక్ దశలో ఉపయోగించిన భాగాలను తయారు చేసింది ఈ సంస్థే.
చంద్రయాన్-3 మిషన్ విజయంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కూడా పాత్ర పోషించింది.
గతేడాది హిందుస్థాన్ ఏరోనాటిక్స్- ఎల్అండ్టీ కన్సార్టియం న్యూ స్పేస్ ఇండియా
లిమిటెడ్ నుంచి ఐదు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రాకెట్లను తయారు చేయడానికి
రూ. 860 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ కి
అనేక భాగాలు అందించడం ద్వారా చంద్రయాన్-3 మిషన్‌కు కీలకమైన సహాయాన్ని
అందించినట్లు ఒక మీడియా రిపోర్ట్ పేర్కొంది. చంద్రయాన్ 3 మిషన్ ఎల్వీఎం3
లాంచ్ వెహికల్లో ఉపయోగించిన క్లిష్టమైన S200 బూస్టర్ విభాగాలను
వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్ తయారు చేసిందని ఆ సంస్థ సీఈవో, ఎండీ చిరాగ్
దోష్‌ను ఉటంకిస్తూ హిందూస్తాన్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఫ్లెక్స్ నాజిల్
కంట్రోల్ ట్యాంకేజీలు, S200 ఫ్లెక్స్ నాజిల్ వంటి ఇతర సబ్‌సిస్టమ్‌లు కూడా ఈ
సంస్థ ఉత్పత్తేనని వివరించింది. ఇక బాలానగర్‌లోని ఎంటీఏఆర్ టెక్నాలజీస్ సంస్థ
చంద్రయాన్-3కి సంబంధించిన కీలక భాగాలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించింది.