ఇబ్బంది పడుతున్నారు. చెడు కొవ్వు కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయి. చెడు
కొలెస్ట్రాల్ ను కరిగించాలంటే ఈ వెజ్ ఫుడ్స్ తింటే చాలు.
పప్పులు:
రోజువారీ ఆహారంలో వివిధ రకాల పప్పులను భాగం చేసుకోవడంతో సులభంగా బరువు
తగ్గవచ్చు. చెడు కొలెస్ట్రాల్ సైతం వేగంగా కరుగుతుంది. వీటిని తినడంతో
శరీరానికి కావాల్సిన ప్రోటీన్ సైతం అందుతుంది.
తోటకూర:
తోటకూరను ఆహారంలో భాగం చేసుకోవడంతో సులభంగా బరువు తగ్గవచ్చు. తోటకూర తినడంతో
శరీరానికి కావాల్సిన పోషకాలు సులభంగా అందుతాయి. వ్యాధినిరోధకశక్తి
మెరుగుపడుతుంది.
బాదం:
బాదం తినడంతో శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ సులభంగా కరుగుతుంది. ఇది
లిపిడ్ ప్రొఫైల్ను మెరుగుపరుస్తుంది. ఉదర భాగంలో ఉన్న కొవ్వును కరిగించడంలో
ఇది సహాయపడుతుంది.
క్వినోవా:
క్వినోవాలో డైటరీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. క్వినోవా జీవక్రియ రేటును
మెరుగుపరుస్తుంది. వీటిని తినడంతో సులభంగా బరువు తగ్గవచ్చు.
పాలకూర:
పాలకూర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా
ఉంటాయి. వీటిని తినడంతో వేగంగా బరువు తగ్గవచ్చు.
పన్నీరు:
రుచికరంగా ఉండే పన్నీర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో కేలరీలు, కొవ్వులు
తక్కువగా ఉంటాయి. వీటిని తినడంతో బరువు సులభంగా తగ్గవచ్చు. చెడు కొవ్వు వేగంగా
కరుగుతుంది.
బ్రోకలి:
దీనిని ఆహారంలో భాగం చేసుకోవడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్రోకలి కొవ్వును
కరిగించడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియల రేటును వేగవంతం చేస్తుంది. దీంతో
వేగంగా బరువు తగ్గవచ్చు.
మొలకలు:
మొలకలు తినడంతో ఆరోగ్యం బాగుంటుంది. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని
తినడంతో కడుపు నిండిన భావం కలుగుతుంది.