చెబుతున్నారు. క్రమం తప్పకుండా అల్లం.. తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు
కలుగుతాయో చూద్దాం..
రోగనిరోధక శక్తి:
ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అల్లంలో ఉండే
యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
చెడు కొలెస్ట్రాల్:
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో అల్లం సహాయపడుతుంది. అల్లంలోని
పోషకాలు బాడీలో కేలరీల సంఖ్యను తగ్గిస్తాయి.
జీర్ణ శక్తి:
అల్లానికి జీర్ణక్రియను వేగవంతం చేసే గుణాలు ఉన్నాయి. ఆకలి పెంచేందుకు అల్లం
ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల్ని నివారిస్తుంది.
షుగర్ నియంత్రణకు:
రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలోనూ అల్లం దోహదపడుతుంది. డయాబెటిస్
పేషెంట్లలో ఇన్సులిన్ వ్యవస్థను మెరుగుపర్చేందుకు అల్లం ఉపయోగపడుతుంది.
ఒళ్లు నొప్పులు:
వ్యాయామం వల్ల లేదా వేరే కారణాల వల్ల కలిగే ఒళ్లు నొప్పిల్ని తగ్గించడానికి
అల్లం దోహదపడుతుంది. కండరాల నొప్పి, కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్ నొప్పుల్ని
నివారిస్తుంది.
జలుబు:
జలుబు, గొంతునొప్పి, దగ్గు వంటి రోగాలను తగ్గించడంలో ప్రభావవంతంగా
పనిచేస్తుంది. వీటి నుంచి త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తుంది. జలుబు ఉన్నపుడు
అల్లం టీ తాగడం చాలా మంచిది.
వికారం:
దీర్ఘకాలిక అజీర్ణ సమస్యలను తగ్గించడంలోనూ అల్లం సాయం చేస్తుంది. వికారంతో
బాధపడుతున్న వారికి మంచి మందులా పనిచేస్తుంది.
క్యాన్సర్:
రోజ అల్లం వాడేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువని అధ్యయనాలు
చెబుతున్నాయి. క్యాన్సర్ కణాలను చంపే శక్తి అల్లానికి ఉంది.