హరినాథ్ గౌడ్ తుదిశ్వాస విడిచారు. బత్తిని సోదరుల్లో ఒకరైన హరినాథ్
గౌడ్(84) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందారు. వివరాల
ప్రకారం చేప మందు పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ అనారోగ్యం కారణంగా
మృతిచెందారు. హరినాథ్ గౌడ్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఇక, ఆయన పేరు
చెబితే ముందుగా గుర్తుకువచ్చేది చేప ప్రసాదం. ఏటా మృగశిర కార్తె రోజున
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబ సభ్యులు చేప
మందు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చేప ప్రసాదం కోసం తెలంగాణ నలు మూలల
నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఆస్తమా బాధులు
రెండు రోజుల ముందుగానే నగరానికి వస్తుంటారు.
చేప మందు చరిత్ర ఇదే : 1847లో హైదరాబాద్ సంస్థానంలో చేప మందు ప్రసాదం పంపిణీ
ప్రారంభమైంది. నాడు వీరన్న గౌడ్ అనే వ్యక్తి ప్రతి మృగశిర కార్తె ముందు రోజు
నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు. తదనంతరం తన కుమారుడు బత్తిని శివరామ
గౌడ్, అతని కుమారుడు బత్తిని శంకర్‌గౌడ్ ఈ ప్రసాదాన్ని ఏటా వేస్తూనే ఉన్నారు.
ప్రస్తుతం శంకర్‌గౌడ్, సత్యమ్మ దంపతుల ఐదుగురు కుమారుల్లో బత్తిని హరినాథ్
గౌడ్, బత్తిని ఉమామహేశ్వర్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు కలిసి చేప ప్రసాదాన్ని
పంపిణీ చేస్తున్నారు. ఇలా గత 176 ఏండ్లుగా చేప మందు పంపిణీ కొనసాగుతూనే
ఉన్నది. అయితే మధ్యలో కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ రెండేండ్ల పాటు
నిలిచిపోయిన విషయం తెలిసిందే. చేపమందుకు కోసం వచ్చేవారికి ప్రభుత్వమే అన్ని
ఏర్పాట్లు చేస్తూ వస్తున్నది.
వంశపారంపర్యంగా ఎన్నో తరాలనుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది
ఆస్థమా,ఉబ్బసం , దగ్గు, దమ్ము, లాంటి అనేక దీర్ఘకాలిక శ్వాస సంబంధ వ్యాధుల తో
బాధపడే రోగులకు ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే మృగశిర కార్తి రోజున
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ ద్వారా నయం చేస్తూ
ఎనలేని కీర్తి గడించిన బత్తిన హరినాథ్ గౌడ్(84) నిన్నరాత్రి 7.30 గంటల సమయంలో
కవాడి గూడ లో ఉన్న స్వగృహంలో కన్నుమూశారు.
ముప్పై సంవత్సరాలు గా తీవ్ర మధుమేహంతో బాధపడుతున్న హరినాథ్ కు రెండు
సంవత్సరాల క్రితం ఓ కాలు తీసివేశారు. అప్పటినుంచి ఆర్టిఫీషియల్ కాలు తో తన
కర్తవ్యాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. గత కొన్ని నెలలుగా మంచానికే
పరిమితంమైన ఆయనకు ద్రవహారం తోనే వైద్య సేవలు జరుగుతున్నాయను కొడుకు అమర్నాథ్
గౌడ్ తెలియ చేశారు.. ఆయన కు భార్య సుమిత్రా దేవి,ఇద్దరు కుమారులు అనిల్
(ప్రస్తుతం ఆస్ట్రేలియా) ఉన్నట్లు సమాచారం) రెండవ కుమారుడు అమర్నాథ్ గౌడ్
కవాడీగూడాలో తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. ఇద్దరు కుమార్తెలు అలకనంద
(అమెరికాలో ఉన్నారు) అర్చనా హైద్రాబాద్ లోనే ఉంటున్నారు.. విదేశాల్లో ఉన్న
అక్క ,అన్న ఈరాత్రికి వస్తారని, రేపు ఉదయం 10 గం లకు బన్సీలాల్ పేట హిందూ
స్మశాన వాటిక లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని హరినాథ్ కొడుకు
అమర్నాథ్ గౌడ్ మరియు అన్న కొడుకు బత్తిన గౌరీ శంకర గౌడ్ తెలిపారు.
తరాలు మారినా దాదాపు ఏడు దశాబ్దాలుగా బత్తిన హరినాథ్ గౌడ్ నేతృత్వంలోనే చేప
ప్రసాదం పంపిణీ జరుగుతూ ఉండేది .కుటుంబ సభ్యులందరినీ కలుపుకు పోతూ ఎన్ని
ప్రభుత్వాలు మారినా , అమాత్యులతో అధికారులతో సామాజిక సేవా సంఘాల తో ఎంతో గౌరవ
ప్రదమైన సత్ సంబంధాలు కొనసాగిస్తూ ఎన్ని విమర్శలు ఎదురైనా ధీటుగా ఎదుర్కొంటూ
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో లక్షలాది మంది కి చేప ప్రసాదం పంపిణీ
చేసేవారు. ముఖ్యంగా జాతీయ , రాష్ట్రీయ మీడియా రంగం లో పనిచేసే ప్రతి
ఒక్కరితో చివరి వరకూ ఎంతో ఆత్మీయ సంబంధాలు కొనసాగించారు. హరినాథ్ గౌడ్
ఇద్దరు అన్నలు చనిపోగా తమ్ముడు విశ్వనాథ గౌడ్ అన్నదమ్ముల కొడుకులు మనవులు
మనవరాళ్లు ఉన్నారు.. బత్తిన హరినాథ్ గౌడ్ మరణం వారి కుటుంబానికే కాక లక్షలాది
మంది ఆస్థమా రోగులకు తీరని మనో వేదన. తెలంగాణ బిడ్డగా ఆయన చేసిన నిస్వార్థ
అకుంటిత సేవలు భారతదేశ చరిత్ర లోనే లిఖించే ఆస్థమాద్యాయం.