రాజకీయ పదవుల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం
సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన
రూ. 2వేల కోట్లతో గిరిజన యూనివర్సిటీ :కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
విజయనగరం : సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మెంటాడ,
దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ
విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర
ప్రధాన్ సమక్షంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ
సందర్భంగా ఆయన మాట్లాడతూ రాజకీయ పదవుల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం.
గిరిజన ఎమ్మెల్యేను డిప్యూటీ సీఎంను చేశాం. 4లక్షల 58వేల గిరిజన కుటుంబాలకు
నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. గిరిజనులకు అల్లూరి, మన్యం
జిల్లాలు ఏర్పాటు చేశాం. గిరిజన ప్రాంతంలో మల్లీ సెష్పాలిటీ ఆసుపత్రులను
ఏర్పాటు చేస్తున్నాంమన్నారు. ఏజెన్సీలో 497 సచివాలయాల్లో వలంటీర్లంతా
గిరిజనులే. 36 లక్షల 12వేల గిరిజన కుటుంబాలకు డిబీటీ ద్వారా మేలు చేస్తున్నాం.
రూ.11వేల 547కోట్ల నగదు అకౌంట్లలో జమ చేశాం. ఈ వర్సిటీ గిరిపుత్రుల జీవితాలను
మారుస్తుందని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మరడాం సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ నన్ను నిరంతరం
గుండెల్లో పెట్టుకున్న గిరిజన జాతికి కృతజ్ఞతలు. గిరిజన వర్సిటీ మంజూరు
చేసినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో గిరిజనులు
ప్రపంచంతో పోటీపడతారు. గిరిజనులు స్వచ్చమైన మనసు కలిగినవారు. తరతరాలుగా
గిరిజనులు అభివృద్ధికి దూరంగా ఉన్నారు. నాలుగేళ్ల పాలనలో మీ బిద్ద విద్య,
వైద్యం, వ్యవసాయం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గిరిజనులకు ప్రాధాన్యత
ఇచ్చాం. దోపిడీ నుంచి గిరిజనులను రక్షించేందుకు కృషి చేశాం. ప్రపంచ స్థాయి
ఉన్నత విద్యను గిరిజనులకు అందిస్తున్నాం. మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్
కాన్సెప్ట్ అమలు చేస్తున్నాం. ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లు
అందిస్తున్నాం. చదువులను ప్రొత్సహిస్తూ కళ్యాణమస్తు, షాదీతోఫా కార్యక్రమాలు
తీసుకువచ్చాం. పూర్తి ఫీజు రీయింజర్స్‌మెంట్‌తో విద్యాదీవెన, వసతిదీవెనను
తీసుకువచ్చాం.
కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ రాబోతోంది. పాడేరులో మెడికల్ కాలేజీ
రాబోతోంది. బోగాపురంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటవుతోంది. సాలూరులో గిరిజన వర్సిటీ
వచ్చేస్తోంది. గిరిజన విద్య, సాధికారతకు ప్రభుత్వం బాటలు వేస్తోంది. రాజకీయ
పదవుల్లో గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చాం. గిరిజన ఎమ్మెల్యేను డిప్యూటీ సీఎంను
చేశాం. 4లక్షల 58వేల గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల విద్యుత్
ఇస్తున్నాం. గిరిజనులకు అల్లూరి, మన్యం జిల్లాలు ఏర్పాటు చేశాం. గిరిజన
ప్రాంతంలో మల్లీ సెష్పాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ప్రధాని మోడీ , సీఎం జగన్ చొరవతో
గిరిజన వర్సిటీ సాధ్యమైంది. రూ. 2వేల కోట్లతో గిరిజన యూనివర్సిటీ
ఏర్పాటవుతోంది. గిరిజన ప్రాంతంలోనే వర్సిటీ పెట్టాలని సీఎం జగన్ తలచారు.
రాయ్‌పూర్ నుంచి విశాఖ వరకు ఆరులైన్ల రోడ్డు ఏర్పాటవుతోంది. పేదల గృహాల కోసం
కేంద్రం రూ.లక్షా 20వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మా పార్టీలు వేరైనా అభివృద్ధి
విషయంలో కలిసి పనిచేస్తున్నాం. మాతృ భాషలకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత
ఇస్తుంది. ఏపీలో ద్విభాషా పాఠ్యపుస్తకాలు తీసుకురావడం అభినందనీయం. అల్లూరి
సీతారామరాజు నడిచిన పవిత్ర నేల ఇది. ఏపీ ప్రభుత్వం ఇంగ్లీష్‌కు ప్రాధాన్యత
ఇస్తుంది. గిరిజన వర్సిటీతో పేద విద్యార్థులకు మంచి భవిష్యత్తు. ఏపీలో
అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఇక్కడ అంతర్జాతీయ కోర్సులు
ప్రవేశపెడతామన్నారు.