చాగల్లు : అర్హులైన ప్రతి ఒక్కరికీ కుల, మత, వర్గ, పార్టీలు, రాజకీయాలకు
అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి, ప్రకృతి
విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గడప గడపకు మన
ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 126వ రోజు పర్యటనను చాగల్లు మండలం చాగల్లులో
శుక్రవారం నిర్వహించారు. ముందుగా చాగల్లు మెయిన్ రోడ్డు లో కనకదుర్గమ్మ వారి
ఆలయంలో హోంమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వందలాది నాయకులు,
కార్యకర్తలు, అభిమానులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. చిన్నారులు, మహిళలు,
వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి
ఇంటికి ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమాన్ని లెక్కలతో సహా కుటుంబ సభ్యులకు
వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్
జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలను అమలు
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారన్నారు. చెప్పినవే కాకుండా
చెప్పని హామీలను కూడా చేసి చూపిస్తున్న ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు.
అందుకే ప్రజలందరూ ముఖ్యమంత్రికి జననీరాజనం పలుకుతున్నారన్నారు. ప్రజా సమస్యలను
తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని
సీఎం రూపొందించారని ఆమె తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే
పరిష్కరించాలని సచివాలయ సిబ్బంది, అన్ని శాఖల అధికారులను హోంమంత్రి తానేటి
వనిత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు,
కార్యకర్తలు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.