రాజకీయం గా మమ్మల్ని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ధన్యవాదాలు
విజయవాడ : నూర్ భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం
విజయవాడ లోని కుమ్మరి పాళెం సెంటర్ షాదిఖానా సమావేశంలో పునర్మించారు. ఈ
కార్యక్రమంలో తిరిగి రాష్ట్ర అధ్యక్షులుగా మరల షేక్ సయ్యద్ బాజీ ( ఎస్ ఎస్
బాజీ) ని కార్యవర్గ సభ్యులు కలిసి ఎన్నుకున్నారు. అనంతరం కార్యవర్గ సమావేశంలో
కార్యవర్గ సభ్యులుగా, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు టంగుటూరు గౌసియా, రాష్ట్ర
యూత్ అధ్యక్షులు మట్టిపాటి భాష, రాష్ట్ర ఉద్యోగ అధ్యక్షులుగా షేక్ మౌసి,
రాష్ట్రం లీగల్ అడ్వైజర్ గా ఆకుముల పెద్ద కాశయ్య , రాష్ట్ర సోషల్ మీడియా
ఇన్చార్జిగా దూదేకుల హుస్సేన్ , ఉమ్మడి జిల్లాల నుంచి ఒక్కొక్కరిని రాష్ట్ర
కమిటీలు ఎన్నుకున్నారు.
అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ అధ్యక్షులు, అలాగే 21 జిల్లా
యూత్ అధ్యక్షులు 15 జిల్లాల సోషల్ మీడియా అధ్యక్షులు నియమించారు. ఈ
కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి
సమస్య ఉన్నన్నా ఫోన్ చేయండి. మీకు ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి ప్రతి
గడపకి స్వయంగా నేనే వచ్చే సమస్య పరిష్కరిస్తానని, అలాగే త్వరలో కుప్పం నుంచి
ఇచ్చాపురం వరకు రాష్ట్ర స్థాయి పర్యటన ఉంటుందని తెలిపారు. అలాగే ప్రభుత్వం
కూడా నామినేటెడ్ స్థాయి పదవుల్లో మమ్మల్ని గుర్తించి నూర్ భాషాలకు సముచిత
న్యాయం కల్పించాలని ప్రభుత్వానికి మరియు పార్టీ పెద్దలకు తెలిపారు. ఎన్నో
దశాబ్దాలుగా విద్యార్థుల్లో బదిలీ సర్టిఫికెట్ లో రాష్ట్రంలో మూడు రకాలుగా
ఒకటి ఇండియన్ – హిందూ – దూదేకుల 2. ఇండియన్ – ముస్లిం – దూదేకుల 3. ఇండియన్
– ఇస్లాం – దూదేకుల అని ఇస్తున్నారని దాని గురించి ప్రభుత్వం దృష్టికి
తీసుకెళ్లి కేవలం ఇండియన్ ఇస్లాం దూదేకుల ఇవ్వాలని ఒక జీవో మంజూరు చేయాలని
కోరారు. అలాగే నాయిని బ్రాహ్మణుల్ని కించపరిచినట్టు ప్రభుత్వం గుర్తించి చట్ట
ప్రకారం చర్యలు తీసుకునేలా ఏ రకంగా అయితే ప్రభుత్వం జీవో ఇచ్చిందో మా దూదేకుల
నూర్ భాషా కులాన్ని కించపరిచిన దూదేకులోడా, పింజరోడ, పింజారి వెధవ, సగం సాయిబు
అన్న వారిని కూడా చట్టప్రకారం చర్యలు తీసుకొని ఎలా ప్రభుత్వం ఒక జీవ మంజూరు
చేయాలని కోరడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మా కమ్యూనిటీని గుర్తించి
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రెండు కార్పొరేషన్ చైర్మన్లు, ఒక మేయర్ పదవి,
రెండు మార్కెట్ యార్డ్ చైర్మన్లు, రెండు మున్సిపాలిటీ చైర్మన్లు, మూడు
మున్సిపాలిటీ వైస్ చైర్మన్లు, మూడు ఎంపీపీ పదవులు, జడ్పీటీసీ పదవులు నాలుగు,
అలాగే అనేక మంది సర్పంచ్లు వార్డు మెంబర్ని మమ్మల్ని రాజకీయంగా ఎంతో ముందుకు
తీసుకొని వచ్చారని, అలాగే వచ్చే ఎన్నికల్లో కనీసం రాష్ట్రంలో మా దూదేకుల నూర్
భాషా వర్గానికి చెందిన వారికి ఒకరికి ఎక్కడైనా ఒక చోట ఎమ్మెల్యేగా అవకాశం
కల్పించాలని కోరారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ హుస్సేన్ మాట్లాడుతూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి
దూదేకుల వర్గానికి ఎంతో మేలు చేశారని, కళ్యాణమస్తు పథకాన్ని ఇటీవల జగన్
లక్ష రూపాయలు పెంచి దూదేకుల పేద కుటుంబాలకు అండగా నిలిచారని తెలిపారు.
రాష్ట్ర కోశాధికారి షేక్ దత్తేశ్వర్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 77
సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు చట్టసభల్లో లేని ఏకైక కులం మా దూదేకుల కులం
అని చాలా బాధపడుతున్నారు. కనీసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అయినా గుర్తించి
ఒక ఎమ్మెల్యే సీటు ప్రకటిస్తారని రాష్ట్రంలో ఎదురుచూస్తున్న నూర్ భాషా
కులస్తులు. నూర్ భాషా దూదేకుల సామాజిక వర్గం ప్రధానంగా ఎన్నో సంవత్సరాల నుంచి
అత్యంత వెనుకబడిన సామాజిక వర్గంగా ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని ప్రభుత్వం
నుంచి బ్యాంకులతో ఎటువంటి సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయాలన్నారు.
ఆర్థికంగా, రాజకీయంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించి తమ కులానికి కూడా
అవకాశం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ నాగూర్ మీరా (పల్నాడు జిల్లా),
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ హుస్సేన్ (పశ్చిమగోదావరి జిల్లా), రాష్ట్ర
కోశాధికారి షేక్ దత్తేశ్వర్ గారు (ప్రకాశం జిల్లా) ‘రాష్ట్ర కన్వీనర్ షేక్
బాబ్జి గారు (విశాఖపట్నం జిల్లా), రాష్ట్ర సలహాదారుడు పాలగిరి ఫయాజుర్రహ్మాన్
(అన్నమయ్య జిల్లా) , రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు టంగుటూరి గౌసియా (కడప జిల్లా)
, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్ బి (నెల్లూరు జిల్లా) , రాష్ట్ర
సహాయ కార్యదర్శి వజ్రాల అక్బర్ (చిత్తూరు జిల్లా), రాష్ట్ర అదనపు కార్యదర్శి
షేక్ వలియ బాబా (తూర్పుగోదావరి జిల్లా) , రాష్ట్ర ప్రచార కార్యదర్శి షేక్ బాజీ
మీరావాలి (ఎన్టీఆర్ జిల్లా) రాష్ట్ర ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ షేక్ నాగూర్
విశాఖపట్నం జిల్లా, రాష్ట్ర గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ షేక్ బాజీ, రాష్ట్ర
కోస్తాంధ్ర కోఆర్డినేటర్ షేక్ నాసరయ్య, రాష్ట్ర పశ్చిమ రాయలసీమ కోఆర్డినేటర్
పుల్లూరు ఖాజావలి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ జిల్లాల అధ్యక్షులు
మరియు జిల్లాల యూత్ అధ్యక్షులు, రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు, జిల్లా సోషల్
మీడియా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.