ప్రతిరోజూ కచ్చితంగా 8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. అర్ధరాత్రి వరకు
మెలకువతో ఉండటం, ఆలస్యంగా లేవడం వంటివి మీకు అకాల అనారోగ్య సమస్యల్ని
తెచ్చిపెడతాయి. మానసిక ఎదుగుదల ఉండదు. అందువల్ల సరైన నిద్ర కచ్చితంగా
ఉండాల్సిందే.
నో స్మోకింగ్:
సిగరెట్ తాగే అలవాటు మానుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదని
గుర్తించండి. ఒత్తిడి తగ్గించడానికి పీల్చే సిగరెట్ పొగ వల్ల మరింత ఒత్తిడికి
గురవుతారన్న నిజాన్ని తెలుసుకోండి.
వ్యాయామం:
శరీరం ఉల్లాసంగా ఉండేందుకు ప్రతిరోజూ లేదా వారానికి మూడు, నాలుగు రోజులు
వ్యాయామం చేయడానికి కేటాయించండి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగుపడి హుషారుగా
ఉంటారు. శరీరం నుంచి విష పదార్థాలు చెమట ద్వారా బయటకు పోవడం వల్ల ఆరోగ్యంగా
ఉండవచ్చు.
ఒత్తిడికి చెక్:
ఒత్తిడిని మీ దరిచేరనివ్వకండి. దీనివల్ల మానసికంగా కుంగిపోతారు. ఆకలిపై
నియంత్రణ ఉండక బరువు పెరగడం, తగ్గడం జరుగుతుంది. ఇది అనేక అనర్థాలకు
దారితీస్తుంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించేందుకు మెడిటేషన్ వంటివి చేయండి.
మ్యూజిక్ వినండి. ఏవైనా మంచి పుస్తకాలు చదవండి.
మద్యం తాగవద్దు:
అతిగా మద్యం తాగడం మానుకోండి. డాక్టర్ల సలహా మేరకు మితంగా తాగడం మంచిది.
ఎక్కువగా మద్యం తాగడం వల్ల శరీరంలోని అవయవాలు తొందరగా పాడైపోతాయి. దీనివల్ల
అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
బంధాలు:
ఫ్యామిలీతో పాటు స్నేహితులతో మంచి సంబంధాలను కలిగి ఉండండి. వారితో మాట్లాడండి.
ఒంటరితనాన్ని దూరం పెట్టి వారితో సరదాగా గడపండి. ఇవి మీ బాడీలో హ్యాపీ
హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి.
నీరు:
ఆరోగ్యంగా ఉండేందుకు రోజులో కనీసం 8 గ్లాసుల నీటిని తాగడం చాలా అవసరం. ఇది మీ
బాడీ నుంచి విషపదార్థాల్ని బయటకు పంపుతుంది. అలాగే మిమ్మల్ని అనారోగ్యం
బారినపడకుండా కాపాడుతుంది.