చర్మం, చేతులు, మెడ మీద వెంట్రుకలు పెరిగితే చూడటానికి బావుండదు. ఇలాంటి
అవాంఛిత రోమాలను తొలగించటానికి ఈ చిట్కాలను పాటించండి..
1.చర్మ సమస్యల చికిత్సకు పసుపు ఉపయోగపడు తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ
సెప్టిక్ లక్షణాలుండే ఈ పసుపు చర్మంపైన ఉండే వెంట్రుకలు పెరగనివ్వదు. కావున
పసుపులో గులాబీ నీళ్లు లేదా పాలు కలిపి ఆ పేస్టును పెదవులపైన లేదా ముఖం మీద
పట్టిస్తే అవాంఛిత రోమాలు పెరగవు.
2.బొప్పాయి తొక్కను తీసి పేస్ట్ లా చేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు కలిపి
చూర్ణం చేయాలి. ఈ చూర్ణాన్ని చర్మం మీద వెంట్రుకలు ఉండే ప్రాంతంలో పట్టించి
అరగంట ఆగిన తర్వాత మంచి నీళ్లతో శుభ్రపరచుకోవాలి. ఇలా నాలుగు వారాల పాటు
చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
3.బౌల్లో నిమ్మరసం, తేనెను సరైన పాళ్లలో తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. నిమ్మలో
సిట్రిక్ ఆమ్లం ఉండటం వల్ల మంచి క్లీనింగ్ ఏజెంట్ల ఉపయోగపడుతుంది.
హైడ్రేటింగ్, మాయిశ్చరైజింగ్ లక్షణాలుండే తేనెను నిమ్మరసంతో కలిపినపుడు
చర్మంమీద వెంట్రుకలు పెరగవు. పైగా చర్మం మృదువుగా తయారవుతుంది.
4.ఎర్ర కందిపప్పు, బంగాళదుంపను కలిపి మెత్తని చూర్ణం చేసుకోవాలి.
బంగాళదుంపలోని న్యాచురల్ బ్లీచ్ లక్షణాల వల్ల అవాంఛిత రోమాల రంగు
తగ్గిపోతుంది. వెంట్రుకలు ఉన్నట్లు కనపడవు.
5.బౌల్లో టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల చక్కెర వేసి కొద్దిగా
నీళ్లు కలిపి మిక్స్ చేయాలి. మైక్రోవేవ్ లో అరనిముషం ఉంచి తీసేసిన తర్వాత
అన్వాంటెడ్ ఫేసియల్ హెయిర్ మీద పట్టించాలి. వ్యతిరేక దిశలో పీల్ ను తీసేయాలి.
6.చర్మం మీద అందవిహీనంగా కనపడే వెంట్రుక లను హెయిర్ రిమూవర్స్ తో తీసేయవచ్చు.
ప్లక్కింగ్ బదులుగా వ్యాక్సింగ్ చేసుకోవచ్చు. లేజర్ చికిత్సతో కూడా ఈ సమస్యను
శాశ్వతంగా అధిగమించే అవకాశం ఉంది.