గన్నవరం : ఏపీలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తమ్ముడినంటూ మోసాలకు
పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే కృష్ణా
జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామానికి చెందిన తొందూరు శామ్యూల్
హనుమాన్ జంక్షన్‌లోని పశువుల సంతలో పశువుల వ్యాపారం చేస్తుండగా కొంత కాలం
క్రితం సంతలో దొంగల శ్రీధర్ పరిచయమయ్యాడు. తాను కోనసీమ జిల్లా రామచంద్రాపురం
నియోజకవర్గానికి చెందిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకి తమ్ముడిని
అవుతానని శామ్యూల్‌తో పరిచయం చేసుకున్నాడు. AP 39 UK 777 కారుపై MLA స్టిక్కర్
వేసుకుని తిరుగుతూ రామ చంద్రాపురంలో కూడా పశువుల వ్యాపారం చేద్దాం, అక్కడ నాకు
ఎక్కువ మంది పరిచయం ఉన్నారని నమ్మించాడు. శామ్యూల్ వద్ద రూ.10వేలు
తీసుకున్నాడు. ఇలా తరచూ శామ్యూల్‌ను డబ్బులు డిమాండ్ చేశాడు. ఈనెల 25న
సాయంత్రం వేలేరు గ్రామం వద్ద శామ్యూల్‌ను అడ్డగించిన దొంగల శ్రీధర్ మంత్రి
తమ్ముడినని చెప్పినా డబ్బులు ఇవ్వవా? నీ అంతు చూస్తానని బెదిరించాడు. బాధితుడి
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు దొంగల శ్రీధర్‌ను అరెస్టు
చేసి నూజివీడు కోర్టులో హాజరు పర్చారు. దొంగల శ్రీధర్‌పై ప్రత్తిపాడు,
ద్రాక్షారామం, గొల్లపాలెం, రాజానగరం, అన్నవరం, ఆలమూరు పోలీస్ స్టేషన్లలో
దొంగతం, మోసాలకు పాల్పడిన కేసులు నమోదయ్యాయని, కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో
రౌడీ షీట్ ఉందని పోలీసులు వెల్లడించారు.