స్వాగతం పలికిన రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత, కృష్ణజిల్లా కలెక్టర్ పి
రాజాబాబు
రాజాబాబు
గన్నవరం : కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకై ఆదివారం మధ్యాహ్నం
న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టు చేరుకున్నారు.
రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, కృష్ణజిల్లా కలెక్టర్ పి రాజాబాబు కేంద్ర
హోంమంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం
పలికారు. గుంటూరు ఐజి జి. పాలరాజు, జిల్లా ఎస్పీ పి జాషువా, విమానాశ్రయ
ఇన్చార్జ్ డైరెక్టర్ పి.వి.రామారావు తదితరులు కేంద్ర హోంమంత్రికి స్వాగతం
పలికిన వారిలో ఉన్నారు. అనంతరం కేంద్ర హోం మంత్రి బిఎస్ఎఫ్ హెలికాప్టర్లో
ఖమ్మం బయలుదేరి వెళ్లారు.