కథానాయకుడు నాని ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ను ముగించే పనిలో ఉన్నారు. ఈ సినిమా
తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు అంగీకారం తెలిపారు.
కాగా, ఇప్పుడాయన తమిళ దర్శకుడు శిబి చక్రవర్తితో ఓ సినిమా చేయనున్నారని
సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని స్క్రిప్ట్ ఆసక్తికరంగా ఉండటంతో
నాని పచ్చ జెండా ఊపారని తెలిసింది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా
రూపొందించనున్నారని టాక్. త్వరలోనే ఇది పట్టాలెక్కనున్నట్లు ప్రచారం
వినిపిస్తోంది. శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘డాన్’ సినిమాతో వెండితెరకు
దర్శకుడిగా పరిచయమయ్యాడు శిబి చక్రవర్తి. అది రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో
సత్తా చాటింది.