హైదరాబాద్ : నిజామాబాద్ ఐటీ హబ్‌లో తమ బ్రాంచి ఏర్పాటు చేసేందుకు ప్రముఖ
అమెరికన్ కంపెనీ క్రిటికల్ రివర్ ముందుకొచ్చింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో
ఉన్న ఐటీ మంత్రి కేటీఆర్‌తో కంపెనీ ప్రతినిధులు సమావేశమై నిజామాబాద్ ఐటీ
హబ్‌లో కంపెనీ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో మెరుగైన మౌలిక
సదుపాయాలు, రవాణా కనెక్టివిటీ ఉన్నందున రానున్న రోజుల్లో తమ కంపెనీ శాఖను
ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ సెల్
కోఆర్డినేటర్ మహేశ్ బిగాల వెల్లడించారు. ప్రస్తుతం క్రిటికల్ రివర్
కాలిఫోర్నియా, హైదరాబాద్, విజయవాడలో కార్యకలాపాలు సాగిస్తుందని, వీటిలో
వెయ్యి మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే క్రిటికల్ రివర్
కంపెనీ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్‌లో కూడా పర్యటించారని, ఇప్పుడు ఇక్కడ
ఐటీ కంపెనీ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారని అన్నారు.