అమరావతి: అభ్యర్థులు పారిపోయినా, సీట్లు మార్చినా మునిగిపోయే వైకాపా నావను ఏ శక్తీ కాపాడలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రజాగ్రహానికి గురైన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పరారీలో ఉన్నారన్నారు. ఇప్పటివరకు 35 మంది తమ సొంత నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు భయపడి పారిపోయారని ఎద్దేవా చేశారు. వైసీపీలో ఓటమి భయానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమన్నారు. మరో 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తమ సొంత స్థానాల్లో పోటీ చేసేందుకు విముఖంగా ఉన్నారని చెప్పారు. 2024లో ఇక జగన్ అధికారంలోకి రారని, ఆంధ్రప్రదేశ్ బైబై జగన్ అంటోందని లోకేశ్ పేర్కొన్నారు.