సంక్రాంతి ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
విజయవాడ : సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లేవారికి ఏపీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. పండుగకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. స్పెషల్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఆర్టీసీ వసూలు చేయనుంది. జనవరి 6 నుంచి 18 వరకూ ప్రత్యేక బస్సులు నడవనున్నారు. సంక్రాంతికి 6795 స్పెషల్ బస్సులు నడపనుంది. పండుగ రద్దీ దృష్ట్యా పొరుగు రాష్ట్రాలకూ ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడపనుంది. ఆర్టీసీ వెబ్సైట్, టికెట్ బుకింగ్ కేంద్రాల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ సదుపాయం కల్పించనున్నారు. రానుపోను టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి 10 శాతం రాయితీ సౌకర్యం ఆర్టీసీ కల్పించనుంది.