బాలాయపల్లి :-
మండలంలో ఉన్న 72 అంగనవాడి కేంద్రాలకు బియ్యం చేరవేయాల్సిన బాధ్యత విఆర్ ఓల పైన ఉందని తాహసిల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు.
శుక్రవారం మండల కేంద్రంలో ఉన్న తాసిల్దార్ కార్యాలయంలో అంగనవాడి కేంద్రాలకు బియ్యం చేరవేసేందుకు వీఆర్ఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అంగనవాడి కేంద్రంలో మధ్యాహ్న పథకం భోజనం నిర్వహించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంగన వాడి కేంద్రంలో బియ్యం కొరత లేకుండా చూసుకోవాలన్నారు. అంగనవాడి కేంద్రంలో పిల్లలు, గర్భవతులు బాలింతలో సంకిన బట్టి వారికి అందించాల్సిన రేషన్ అందించాలని తెలిపారు. ఈ విషయంలో వీఆర్ ఓలు బాధ్యతగా పనిచేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ పూర్ణ డిప్యూటీ తాసిల్దార్ శిరీష వీఆర్ ఓలు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో:- మాట్లాడుతున్న తాహసిల్దార్