– వేలాదిగా తరలివచ్చిన సామాన్య ప్రజానీకం
– వెంకటగిరిలో కిక్కిరిసిన ప్రజలు
– రాపూరు మెయిన్ సెంటర్ లో బహిరంగ సభ
– బీసీలకు జగన్ హయాంలోనే ప్రాధాన్యం
– వైసిపి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
–
వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర 40వ రోజుకు చేరుకుంది. ఈ బస్సుయాత్రలో భాగంగా శుక్రవారం తిరుపతి జిల్లాలో సాగింది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్సార్సీపీ ఇంచార్జ్ నేదు మల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సుయాత్ర నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నేదురుమల్లి బంగ్లా నుండి ప్రారంభమైన ర్యాలీ ఉక్కి మీదుగా రాపూరు వరకు కొనసాగింది. ముందుగా వైసిపి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రతినిధులతో తొలిత కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ బీసీ సామాజిక నేతలు, జ్యోతిరావు పూలే డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ బాబు జగ్జీవన్‌రామ్ చిత్రపటాలకు పూలమాలేసి నివాళులర్పించారు, అనంతరం మూడు గంటలకు రాపూరు మెయిన్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించారు. దీనికి పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ యాత్రకు నియోజకవర్గ ఇన్చార్జి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు మేయర్ స్రవంతి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, సిపాయి సుబ్రహ్మణ్యం, మెరుగు మురళి, సినీ నటుడు ఆలీ, జిల్లా గ్రంథాలయం చైర్పర్సన్ దొంతి శారద, సర్వజ్ఞ కుమార్ యాచేoద్ర వెంకటగిరి యువరాజు తదితర ముఖ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ కులాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని కొనియాడారు. ఎప్పుడు కనివిని ఎరుగని సామాజిక సాధికారతను అందించిన ఘనుడు సీఎం జగన్మోహన్రెడ్డి అన్నారు. పేదలందరూ బాగుండాలని, వారి తలరాతలు మారి వారి పిల్లలు పెద్ద చదువులు చదవాలని జగనన్న తపిస్తారన్నారు. పేదలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఇంటి గడపల దగ్గరే అందిస్తున్నారన్నారు. పేద పిల్లలకు కార్పొరేట్‌స్థాయి చదువులు సర్కారు బడులకే తీసుకొచ్చిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. పేదలందరికీ రూ.25లక్షల వరకు ఉచితవైద్యం అందించేలా ఆరోగ్యశ్రీని బలోపేతం చేసిన జగనన్న మామూలు రాజకీయనాయకుడు కాదని కొనియాడారు. కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేసే చంద్రబాబు ఎక్కడ? ప్రజలను నమ్ముకుని..వారి మంచికోసం పాలన చేస్తున్న జగనన్న ఎక్కడ అన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు.
తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ …. ఈ నాలుగున్నరేళ్లలో జగనన్న పాలనలో మనమంతా ఎంతో లబ్దిపొందాం. సంక్షేమపథకాలు మన ఆర్థికస్థాయిని పెంచాయి అన్నారు. జగనన్న సామాజిక సాధికారత బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీల తలరాతలే మార్చింది. డిప్యూటీసీఎంలతో సహా మంత్రుల్ని,ఎంపీ,ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ల ఛైర్మన్లను చేసిందన్నారు. చంద్రబాబు పాలనలో అన్నీమోసాలే. ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టడమే. ప్రజలను మభ్యపెట్టి, ఓట్లేయించుకుని, అవసరం తీరాక వదిలేసేవాడు చంద్రబాబు అన్నారు. జగనన్న ఉంటేనే మన బతుకుల బాగుంటాయి. మన పిల్లల భవిష్యత్తు బావుంటుందని పిలుపునిచ్చారు. జగన్ పాలనలో వివక్షకు చోటు లేదు. అదే బాబు పాలనలో అడుగడుగునా వివక్షే. పార్లమెంటులో స్థానాలు, శాసనసభ,శాసనమండలి,స్థానిక సంస్థల్లో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు స్థానాలు కల్పించిన సామాజికసాధికార నేత జగన్ మోహన్‌రెడ్డి. పేదరికం పోవాలి. అంతవరకు నేను పోరాటం చేస్తానంటున్న జగనన్న గురించి మనం ఆలోచించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జగనన్న వస్తేనే మనకు సంక్షేమపథకాలు కొనసాగుతాయన్నారు.